అక్షింతలు అంటే ఏంటి..వాటిని తలపైనే ఎందుకు వేస్తారు..దాని వెనుక గల సైంటిఫిక్ రీజన్..  

Why We Are Using Akshintalu In Indian Marriages-

పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు, దేవాలయాలలోను, పెద్దలు పిన్నల్ని అశీర్వదించడానికి అక్షితలు ఉపయోగిస్తారు.బియ్యానికి పసుపుని కలిపి వాటిని తలపై చల్లి ఆశీర్వదిస్తుంటారు.

ఈ అక్షతలనే దేవుడిపై కూడా వేస్తుంటాం.అసలు ఈ అక్షతలు ఎందుకు వేస్తారు అని ఎప్పుడన్నా ఆలోచించారా.

Why We Are Using Akshintalu In Indian Marriages-

దీని వెనుక అర్దం ఏంటి.అక్షతలు వేయడం వెనుక ఏదన్నా సైంటిఫిక్ రీజన్ ఉందా.

ఉంటే అదేంటి మొదలైన వివరాలు.

అక్షితలు అంటే.

అక్షతలు అంటే క్షతం కానివి అని అర్ధం.అంటే రోకలి పోటుకు విరగనివి అని.శ్రేష్ఠమైన బియ్యమే రోకలి పోటుకు విరగవు.అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక,నూనెతో కలిపి అక్షతలు తయారు చేస్తారు.

నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతుంటారు.ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం.

చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మన పెద్దల నమ్మకం.

అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు.అందుకే అక్షతలను తల పై వేసి ఆశీర్వదిస్తారు.

సైంటిఫిక్‌గా రీజన్ ఏంటంటే.

మానవదేహం ఓ విద్యుత్‌ కేంద్రం.విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చు తగ్గులు సాధారణం.ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.

బియ్యానికి విద్యుత్ శక్తినిని గ్రహించే తత్వం ఉంది.పెద్దలు మనపై అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి.

ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది.అంతే కాదు మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట.

వాటిలో ప్రధానమైనది శిరస్సు.ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా.

తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు.ఈ కారణంగా అక్షతుల ద్వార పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.

భగవంతునిపై అక్షతలు వేయడానికి గల కారణం.

ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పెద్దలు అంటారు’అన్నాద్భవన్తి భూతాని’అని భగవద్గీత లో మూడవ అధ్యాయంలో చెప్పబడింది.

జీవులు అన్నం చేత పుడతారట.ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం.

భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే

.

తాజా వార్తలు

Why We Are Using Akshintalu In Indian Marriages- Related....