మెగా కాంపౌండ్ నుండి వినాయక్‌ తప్పుకున్నాడా? తప్పించారా?- Why Vv Vinayak Out From Chiranjeevi Lucifer Movie Remake

why vv vinayak out from chiranjeevi Lucifer movie remake, acharya, lucifer, vedalam, mega star, movies, remake - Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Lucifer, Mehar Ramesh, Mohan Raja, Ram Charan, Vedalam, Vv Vinayak

మెగా స్టార్‌ చిరంజీవి వరుసగా సినిమాలు కమిట్ అయ్యాడు.ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

 Why Vv Vinayak Out From Chiranjeevi Lucifer Movie Remake-TeluguStop.com

ఒకటి రెండు వారాల్లో ఆచార్య షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆచార్య షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం లూసీఫర్ రీమేక్ ను మోహన్‌ రాజా దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు.

ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఇక రికార్డు స్థాయిలో అంచనాలున్న వేదాళం రీమేక్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Why Vv Vinayak Out From Chiranjeevi Lucifer Movie Remake-మెగా కాంపౌండ్ నుండి వినాయక్‌ తప్పుకున్నాడా తప్పించారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో జై లవకుశ చిత్ర దర్శకుడు బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఆ విషయాన్ని చిరు అధికారికంగా ప్రకటించాడు.

ప్రస్తుతం ఈ నలుగురు దర్శకులతో చిరంజీవి వర్క్‌ చేస్తున్నట్లుగా ఇటీవల ఒక పోస్ట్‌ పెట్టాడు.అందులో వినాయక్‌ లేకపోవడం చర్చనీయాంశంగా ఉంది.

కెరీర్ ఆరంభం నుండి కూడా వినాయక్ కు చిరంజీవి అంటే చాలా అభిమానం.ఆ అభిమానంతోనే వరుసగా సినిమాలు చేశాడు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150 కూడా వినాయక్‌ దర్శకత్వంలో చేశాడు. లూసీఫర్‌ రీమేక్‌ ను వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి చేయాలనుకున్నాడు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా మోహన్ రాజా చేతిలోకి వెళ్లింది.అనూహ్యంగా ఆయనకు ఈ స్క్రిప్ట్‌ వెళ్లడం పట్ల పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.అసలు వివి వినాయక్‌ ఎందుకు చిరు క్యాంప్ నుండి బయటకు వచ్చేశాడు అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న.

ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం కనిపించడం లేదు.బాలీవుడ్‌ నుండి ఈయనకు చత్రపతి ఆఫర్‌ వచ్చింది.

రీమేక్ అయినా బాలీవుడ్‌ ఆఫర్‌ కనుక చిరు మూవీని వదిలేసి ఉంటాడా అంటే ఔను అనే సమాధానం కూడా వినిపిస్తుంది.మొత్తానికి మెగా కాంపౌండ్‌ నుండి చిరంజీవి రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

#Ram Charan #Chiranjeevi #Vedalam #Mehar Ramesh #Lucifer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు