స్టార్ డైరెక్టర్‌ ఇలా చేస్తున్నాడేంటి?  

రామ్‌ చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు తెరకెక్కించి అత్యధిక సక్సెస్‌ రేటును కలిగి ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి.ఈయన రెండేళ్ల క్రితం మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

TeluguStop.com - Why Vamshi Paidipally Not Doing Movies With Star Heroes

ఆ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు.మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు.

కాని ఇప్పటి వరకు వంశీ మాత్రం తదుపరి సినిమాను ప్రకటించలేదు.ఇన్నాళ్లు ఈయన కొత్త కథలు రెడీ చేసుకుంటున్నాడు.

TeluguStop.com - స్టార్ డైరెక్టర్‌ ఇలా చేస్తున్నాడేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

త్వరలో స్టార్ హీరోలకు ఈయన కథలు వినిపించే అవకాశం ఉందని అంతా భావించారు.కాని అనూహ్యంగా వంశీ గురించి తాజాగా ఒక విషయం వెళ్లడి అయ్యింది.

ప్రస్తుతం ఆయన కొత్త కథల విషయమై పెద్దగా ఏ హీరోతో చర్చలు జరపడం లేదు.ఈయన ఆహాకు సలహాలు ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడట.

ఈ విషయాన్ని ఇటీవలే అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు.ఆహా కంటెంట్‌ విషయంలో సలహాలు సూచనలు ఇచ్చేందుకు గాను ఆయన్ను అడగ్గా వెంటనే ఓకే చెప్పాడు అంటూ సభా ముఖంగా చెప్పాడు.

దాంతో పాటు మహేష్‌బాబు నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు మరియు ఇతర వ్యాపారాలు కూడా వంశీ పైడిపల్లి చూసుకుంటున్నాడు.దర్శకుడిగా మంచి ప్రతిభ ఉన్న వంశీ ఎందుకు ఇలా చిల్లర పనులు చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద ఎత్తున స్టార్‌ డైరెక్టర్‌లు వరుసగా సినిమాలు చేస్తున్నారు.కాని వంశీ మాత్రం కొత్త దర్శకుల మాదిరిగా సలహాలు ఇస్తూ సమయం వృదా చేస్తున్నాడేమో అనిపిస్తుంది.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్‌ బాబు ఈయనకు డేట్లు ఇచ్చేందుకు మొదట ఓకే చెప్పాడు.కాని ఏం జరిగిందో ఏమో కాని ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యి సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.

మొత్తానికి వంశీ తీరుపై ఆయన అభిమానులు స్వయంగా ఇలా చేస్తున్నాడేంటీ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

#Aha OTT #Mahesh Babu #Allu Arjun #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు