వారిని అడ్డుకుని తీరుతాం..ట్రంప్ హెచ్చరికలు..!!

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలసదారుల రాకలు ఎక్కువగా అయ్యాయని ఒక నివేదిక గతంలోనే తేల్చింది అయితే ఈ నివేదికని మరోసారి నిజం చేస్తూ అమెరికాలోకి భారీ సంఖ్య లో వలసదారులు వేల సంఖ్యలో రావడం ట్రంప్ ప్రభుత్వాన్ని విస్మయానికి గురించేస్తోంది.అసలే వలసలపై ఉర్రుగా ఉన్న ట్రంప్ ప్రస్తుత పరిస్థితి పై తీవస్తాయిలో మండిపడుతున్నారు.

 Why Trumps 5200 Troops Cant Stop Migrants At The Us Mexico Border-TeluguStop.com

సెంట్రల్‌ అమెరికా దేశాల నుండి వేలాదిమందిగా తరలి వస్తున్న శరణార్ధులను అమెరికాలోకి రాకుండా నిలువరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున సమాయత్తమవుతోంది.

అమెరికా-మెక్సికో సరిహద్దు పొడవునా దాదాపు 5,200మంది బలగాలను, ఆయుధాలను మోహరించినట్టు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.టెక్సాస్‌, అరిజోనా, కాలిఫోర్నియాలో 26 క్రాసింగ్‌ పాయింట్ల వద్ద వలసదారులని అడ్డుకునేందుకు తగు చర్యలు చేపట్టారు.సుమారు 2,092 మంది నేషనల్‌ గార్డులు బలగాలకి సహకరించడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

అమెరికా సరిహద్దుల్లో వలస ప్రవేశాలని మరింత బలంగా చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.రేజర్‌ వైర్‌తో అదనపు సరిహద్దు కంచెల నిర్మాణం, నాలుగు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు, అక్రమ ప్రవేశ పాయింట్లను కనుగొనేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు అన్నింటినీ సన్నద్ధం చేసినట్టు కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ కమిషనర్‌ కెవిన్‌ మెక్‌అలీన్‌ తెలిపారు.రాత్రుళ్ళు కూడా పూర్తి సన్నద్ధత పాటించేలా మూడు హెలికాప్టర్‌ కంపెనీలను రంగంలోకి దించినట్టు ఆయన చెప్పారు.అయితే ఎన్ని ప్రణాళికలు రచించినా సరే వలసదారులు ఎదో ఒక రూపంలో అమెరికాలోకి ప్రవేశించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube