Tollywood Veteran Actors: నాటి రోజుల్లో నటీనటులంతా ఎందుకు నష్టపోయారు ?

ఇప్పుడు అంటే ఒక సినిమా చేయాలంటే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.కానీ నాటి రోజుల్లో అలా కాదు.

 Why Tollywood Stars Lost Their Properties Chandramohan Jayasudha Details, Tollyw-TeluguStop.com

ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలో చేసిన చాల తక్కువ మొత్తంలో వచ్చేది.దాంట్లోనే కుటుంబాన్ని చూసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి.

ఏమైనా కూడబెడితే అరకొర భూములను కొనుక్కునే వారు.నిన్న ఈ మధ్య ఎక్కడో నాటి హీరోయిన్స్ అందరికి ఫెవరెట్ హీరో అయినా చంద్ర మోహన్ ఇంటర్వ్యూ చూసాను.

అందులో తాను తెలియక వేళా రూపాయలు పెట్టి కొన్న భూములు నేడు కోట్లల్లో పోతున్నాయి అని చెప్పాడు .అది చూసాక నిజమే కదా అనిపించింది.అప్పట్లో భూముల రేట్లు అలాగే ఉండేవి.

ఒక లక్ష రూపాయలే కొంపల్లి లో 15 ఎకరాల భూమి కొనేస్తే అది ఎవరో ఆక్రమిన్చుకుంటున్నారని భయపెట్టి తనను ఒక వ్యక్తి ఐదు లక్షలు చేతిలో పెట్టి వెళ్తే నిజమే అనుకోని అమ్ముకున్నాడట చంద్ర మోహన్.

కానీ అది నేడు వందల కోట్ల రూపాయలు పలుకుతుంది .ఇది ఒక్క చంద్ర మోహన్ కి మాత్రమే కాదు నాటి నటీనటులంతా కూడా ఇదే పని చేసారు.ఎవరు ఏది చూపించిన నిజమే అనుకోని కొనేవారు .దాంతో కొన్నాళ్లకు ఎవరో రావడం, భయపెట్టడం లేదంటే అక్కడ లోకల్ లో ఉండేవారు ఆక్రమించడం చేసేవారు.ఈ తలకాయ నొప్పు అంత మనకు ఎందుకు అని చవకగా అమ్మేసేవారు.

Telugu Chandramohan, Actors, Jayasudha, Tollywood, Tollywood Stars-Movie

ఇలా బయటవారిని మోసం చేయడం పెద్దగా కుదరదు.కేవలం సెలబ్రిటీలను మాత్రమే చేసేవారు.ఎందుకంటే వారికి అవన్నీ చూసుకోవడానికి పెద్దగా టైం ఉండేది కాదు.

ఒక పక్క సినిమాలతో తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీగా ఉంటారు.నాలుగేళ్లకు, ఐదేళ్లకు వచ్చేసరికి అస్సలు వారి భూమి ఉందా లేదా కూడా తెలియదు.

ఇలాగె ఒకసారి జయసుధ కు కూడా జరిగిందట.ఆమె ఒక 1200 గజాల భూమిని రాత్రికి రాత్రే 20 అడుగుల లోపలికి తవ్వి మట్టిని అమ్ముకున్నారట.

ఎవరో ఫోన్ చేస్తే వెళ్లి చూసే సరికి ఆమె భూమి ఎక్కడ ఉందొ కూడా గుర్తు పెట్టలేదట.దాంతో వెనక్కి వెళ్లిపోయారట.

ఆలా చాల మంది నాటి రోజుల్లో భూములను కోల్పోయారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube