ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.గత రాత్రి హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ అయ్యింది.ఈ ప్రమాదంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.వెంటనే తనని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన కండీషన్ సీరియస్ గానే ఉంది.సాయి యాక్సిడెంట్ మెగా ఫ్యామిలీని తీవ్ర కలవరపాటుకు గురించేసింది.
మెగా కుటుంబ సభ్యులంతా అపోలో ఆస్పత్రికి చేరుకుని సాయి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.పలువురు తెలుగు సినిమా పరిశ్రమ సభ్యులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా భగవంతుడిని వేడుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదం ఓ సేవా సంస్థలో తీవ్ర ఆవేదనను నింపింది.ఈ సంస్థలోని సభ్యులంతా అన్నం ముద్ద ముట్టకుండా ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు.ఆయన త్వరగా గండం నుంచి గట్టెక్కాలని వేడుకుంటున్నారు.ఇంతకీ సాయి ధరమ్ తేజ్ కు విజయవాడ సేవా సంస్థకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

విజయవాడ వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఉంది.ఇందులో ఎంతో మంది ముదిమి వయసు వారు జీవితాన్ని గడుపుతున్నారు.గతంలో అమ్మ ప్రేమ ఆదరణ వృద్దుల ఆశ్రమం నిర్మాణానికి సాయి ధరమ్ తేజ్ భారీగా ఆర్థికసాయం చేశాడు.వృద్ధాశ్రమం కోసం రెండంతస్తుల బిల్డింగ్ నిర్మించాడు.అంతేకాదు పలుమార్లు ఈ సంస్థను సందర్శించి అక్కడి వారి బాగోగులు తెలుసుకున్నాడు.

అంతేకాదు.అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి దగ్గరుండి అన్ని సదుపాయాలు చూస్తున్నాడు.ఇక్కడ ఉండే పెద్దలందరికీ సాయి ధరమ్ తేజ్ అంటే ఎంతో ఇష్టం.
చెప్పలేనంత ప్రేమ.అందుకే ఆయనకు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆశ్రమం అంతా ఆవేదనతో నిండిపోయింది.
తమను కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి చావుబతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలుసుకుని శోకసంద్రంలో మునిగిపోయింది.ఆయన ఆరోగ్యం కుదుట పడాలని.
త్వరగా ఆస్పత్రి నుంచి బయటకు రావాలని వేడుకుంటుంటున్నారు.