మంచి కథలు చేతిలో ఉన్నా వెయిటింగ్ లో డైరెక్టర్స్.. కారణమిదే?

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం మంచి జోరు మీదుంది.ఈ మధ్య భారీ సినిమాలు విడుదలై కొంత డబ్బును కూడగట్టుకుంది ఇండస్ట్రీ.

 Why These Talented Directors Are In Waiting Buchhibabu Harish Shankar Venky Kudu-TeluguStop.com

అందుకే కొందరు డైరెక్టర్స్ మంచి మంచి కథలను రెడీ చేసుకుని స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం అందరూ కూడా వేరే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో డేట్స్ దొరకడం కష్టంగా ఉంది.

అయినా కానీ డైరెక్టర్స్ మాత్రం తమ స్క్రిప్ట్స్ తో హీరోల చుటూ తిరుగుతున్నారని తెలుస్తోంది.అయితే పాన్ ఇండియా యుగం నడుస్తున్న వేల అలాంటి కథలు అయితేనే వింటున్నారు.

లేదంటే వెయిటింగ్ లో పెడుతున్నారట.దీనితో డైరెక్టర్స్ డైలామాలో ఉన్నారట.

ఎన్టీఆర్ :

అలా చూసుకుంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నాడట.ఇందుకు ఎన్టీఆర్ కూడా సరే అన్నాడు.

కానీ ఈ మధ్యలో ఎన్టీఆర్ కు కొరటాల శివతో సినిమా ఉంది.ఇది పూర్తి కావడానికి ఎలా లేదన్న సంవత్సరం పడుతుంది.

ఇక కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సింది.ఇలా చూసుకుంటే 2023 వరకు బుచ్చిబాబు వెయిటింగ్ తప్పదు.

ఇక అదే బాటలో వక్కంతం వంశీ మరియు తమిళ్ డైరెక్టర్ అట్లీ క్యూలో ఉన్నారు.ఎన్టీఆర్ కోసం చూసి చూసి ఇక వక్కంతం వంశీ యంగ్ హీరో నితిన్ సినిమాను ఓకే చేశాడు అని తెలుస్తోంది.

అటు అట్లీ సైతం ప్రయత్నించి విసిగిపోయి షారుఖ్ ఖాన్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడట.

Telugu Allu Arjun, Chiranjeevi, Directors, Harish Shankar, Heroes Dates, Maruthi

అల్లు అర్జున్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ఎవరికి ఉండదు.ఆయన సినిమా ఓకే చేస్తే చాలు హిట్ అయినా ప్లాప్ అయినా పర్వాలేదు అన్నట్టుగా ఎదురుచూస్తున్నారట.వకీల్ సాబ్ లాంటి హిట్ ను ఇచ్చిన వేణు శ్రీరామ్… ఆ వెంటనే బన్నీ కి స్క్రిప్ట్ వినిపించి ఐకాన్ సినిమాను ఫైనల్ చేశారు.

అయితే పుష్ప సినిమా హిట్ కావడంతో, ఎందుకనో ఐకాన్ ను మూలనపడేశారు.అందుకు ఎలాగయినా బన్నీకి నచ్చేలాగా స్క్రిప్ట్ ను మార్చే పనిలో వేణు బిజీ అయ్యాడట.

ఆలా చూసుకుంటే బన్నీ తర్వాత సుకుమార్ మరియు బోయపాటి లతో చేస్తున్నాడు.కాబట్టి వేణు శ్రీరామ్ కు బన్నీ డేట్స్ దొరకలనంటే ఇంకా రెండు సంవత్సరాలు ఆగక తప్పదు.

ఇప్పటికే బోయపాటి బన్నీ సినిమా ఒకే అయింది.ఇక పుష్ప 2 అయ్యాక దీనిని మొదలు పెడతారట.

Telugu Allu Arjun, Chiranjeevi, Directors, Harish Shankar, Heroes Dates, Maruthi

పవన్ కళ్యాణ్:

పవన్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న డైరెక్టర్లు చాలా మండే ఉన్నారని తెలుస్తోంది.అందులో మొదటగా భవదీయుడు భగత్ సింగ్ ను తీయడానికి పూనుకున్న హరీష్ శంకర్ ఇంకా డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు.ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది.కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.అప్పటి వరకు ఫ్యాన్స్ ను ఏదొక విధంగా టచ్ లో ఉండేలా చేస్తున్నాడు హరీష్ శంకర్. మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

కానీ పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఇంకా దీనిపై క్లారిటీ లేదు.గత సంవత్సరమే వీరిద్దరి సినిమా ఉంటుందని చెప్పిన ఎందుకో ఎటువంటి అప్డేట్ లేదు.

ఇక ఎంతకాలం ఆగినా ఉపయోగం లేదని అర్థమై సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇక తమిళ్ డైరెక్టర్ మరియు నటుడు ఒక తమిళ సినిమాను పవన్ తో రీమేక్ చేయడనికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

కానీ పవన్ నుండి డేట్స్ రాలేదు.

Telugu Allu Arjun, Chiranjeevi, Directors, Harish Shankar, Heroes Dates, Maruthi

ప్రభాస్:

రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మరీనా ప్రభాస్ కోసం డైరెక్టర్లు ఎంతకాలమైనా వెయిట్ చేసేలా ఉన్నారు.ఇప్పుడు ప్రభాస్ కొంచెం కూడా తీరిక లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఆదిపురుష్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, ఇక ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ కూడా షూటింగ్ లో ఉంది… ఈ రెండింటితో పాటు ప్రాజెక్ట్ కె ను కూడా మొదలు పెట్టాడని తెలుస్తోంది.

ఇంత బిజీలో కూడా మారుతీ అనే డైరెక్టర్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది అనే దానికి ఆధారం లేదు.

ఈ సినిమాలు అన్నీ అయితే కానీ ప్రభాస్ డేట్స్ దొరకడం చాలా కష్టం అని తెలుస్తోంది.అర్జున్ రెడ్డి సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా అనుకున్నారు.

ఇప్పుడు డేట్స్ దొరక్క వెయిటింగ్ లో ఉన్నాడు.

Telugu Allu Arjun, Chiranjeevi, Directors, Harish Shankar, Heroes Dates, Maruthi

చిరంజీవి:

ఇక మెగాస్టార్ చిరంజీవి రిటర్న్ లో వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడు.కాగా ప్రస్తుతం డైరెక్టర్లు మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీ ల సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరు.యంగ్ డైరెక్టర్ చిరుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

కానీ ఈ మూడు ప్రాజెక్ట్ లు అయితే కానీ డేట్స్ దొరకడం కష్టం.అందుకే వెంకీ వెయిటింగ్ లో ఉన్నాడు.

ఈ విధంగా ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ మంచి కథలు చేతిలో ఉన్నా స్టార్ హీరోల డేట్స్ దొరక్క పడిగాపులు కాస్తున్నారు.మరి పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తయ్యేది ఎప్పుడో ? ఈ సినిమాలు అన్నీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube