సినిమాలు ఒక్కోసారి ఎందుకు ఫ్లాప్ అవుతాయో ఎందుకు హిట్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంటుంది.కంటెంట్, యాక్టింగ్ అన్నీ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాయి.
కొన్ని సినిమాల్లో ఏం లేకున్నా వసూళ్ల సునామీ సృష్టిస్తాయి.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ కొన్ని సినిమాలు ఇలాగే చేశాయి.
మంచి కథ ఉండీ.నటన వారెవ్వా అనిపించినా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు.
ఎన్నో హోప్స్ తో రిలీజైన ఈ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యువరాజు2000 సంవత్సరంలో ఈ సినిమా రిలీజైంది.వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
నిజానికి ఇది ఫీల్ గుడ్ సినిమా అయినా ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్ రాలేదు.

టక్కరి దొంగఈ మూవీని జయంత్ పర్జానీ తెరకెక్కించాడు.2002లో వచ్చిన ఈ సినిమాకు నంది అవార్డు కూడా దక్కింది.అయినా ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయింది.
ఇందులో మహేష్ నటన స్టోరీ కలిపి హిట్ కావాల్సి ఉన్నా చివరకు ఫట్ అయ్యింది.
నిజంతేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిజానికి గుడ్ మూవీ.
మంచి కంటెంట్ ఉంది.మహేష్ యాక్టింగ్ బాగుంది.
నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్ సినిమాలతో దూకుడు మీదున్న తేజ ఈ చిత్రం తీశారు.అయితే ఓవర్ ఎక్స్‌పెర్టేషన్స్ కొంపం ముంచింది.

అర్జున్ఒక్కడు మూవీ బంఫర్ హిట్ అయ్యాక.గుణ శేఖర్‌తో కలిసి మహేష్ బాబు ఈ సినిమా చేశారు.నిజం లాగే ఈ సినిమా పైనా ప్రేక్షకుల అంచనా అమాంతం పెరిగింది.కానీ మూవీ అనుకున్నంత హిట్ కాలేదు.వాస్తవానికి ఇది సూపర్ హిట్ కావాల్సిన మూవీ.
ఖలేజాసూపర్ స్టార్ హీరో మహేష్ ని కామెడీగా చూపించడం మూలంగా ఈ మూవీ ఫెయిల్ అయ్యింది.
హీరోయిజం మీద కాకుండా కామెమీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

నేనొక్కడినేఈ సినిమా ఊరించి ఊరించి ఉత్తది చేసింది.ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయినా మన ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.మూవీ రిలీజింగ్ టైమ్ సైతం దీనికి కలిసి రాలేదు.
సంక్రాంతి సీజన్‌లో కాకుండా సమ్మర్‌లో విడుదల చేసి ఉంటే విజయం సాధించి ఉండేది.