వంటగ్యాస్ లీక్ అయినప్పుడు అంత దుర్వాసన ఎందుకు వస్తుందో తెలుసా?

మన వంటగదిలో ఉండే ఎల్‌పీజీ సిలిండర్‌ నుంచి వచ్చే వాసనను ఎప్పుడైనా పీల్చారా? గ్యాస్ నుంచి ఇంతటి దుర్వాసన ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి వంట గ్యాస్‌కు వాసన ఉండదని తెలిస్తే ఆశ్చర్యం  కలుగుతుంది.అయినప్పటికీ గ్యాస్ నుంచి దుర్వాసన వస్తుంటుంది.

 Why There Is So Much Stench When Cooking Gas Leaks Pipe Regulator People,  Cooki-TeluguStop.com

దీని వెనుక ఒక కారణం ఉంది.అది వినియోగదారుల భద్రతకు సంబంధించినది.

గ్యాస్ సిలిండర్‌లో ఉన్నంత వరకూ ఎటువంటి ప్రమాదం ఉండదు.అది లీక్ అయ్యిందంటే ఎంతో ప్రమాదకరం.

అందుకే గ్యాస్ లీకేజీ జరిగినవెంటనే మీరు గ్రహించగలగాలి.

ఇందుకోసమే గ్యాస్ ఉత్పత్తి సమయంలో మెర్కాప్టాన్ అనే రసాయన సమ్మేళనాన్ని దానిలో కలుపుతారు.

ఫలితంగా గ్యాస్ నుంచి దుర్వాసన వస్తుంది.లీకేజ్ అయినప్పుడు వెంటనే ఎవరో ఒకరు గుర్తించగలుగుతారు.

తక్షణమే గ్యాస్ లీకేజీని నియంత్రించగలుగుతారు.అప్పడు పెను ప్రమాదం తప్పుతుంది.

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ కంపెనీలు అనేక భద్రతా చర్యలు చేపడతాయి.వాటిలో ఇదొకటి.

అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు, అనుకోని విధంగా ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు గ్యాస్ కంపెనీలు వెంట‌నే స్పందిస్తాయి.ఆధునిక ప‌రిక‌రాల సాయంతో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌స్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube