కొత్త స్టేడియంలో వీరి పేర్లు ఎందుకబ్బా..?!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మొతేరా లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా పేరుగాంచింది.అయితే ఈ వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియానికి తాజాగా నరేంద్ర మోడీ స్టేడియం అని నామకరణం చేశారు.

 Why Their Names Reliance And Adani In The New Stadium Motera Sardar Vallabhai Pa-TeluguStop.com

సాధారణంగా రాజకీయ నేతలు పదవి నుంచి దిగిపోయిన తర్వాత లేక చనిపోయిన తరువాత వారి చేసిన మంచి ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో విమానాశ్రయాలు, స్టేడియాలు ఇలా పలు ప్రముఖ ప్రదేశాలకు వారి పేర్లను పెడతారు.కానీ నరేంద్రమోడీ బ్రతికున్నప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.

దీంతో ప్రజలు, ముఖ్యంగా రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరును పెట్టడం పెద్ద విషయమే కాదని కొందరు తేలిగ్గా తీసుకున్నారు.

కానీ రిలయన్స్ ఎండ్, అదాని ఎండ్ అనే పేర్లను ఈ స్టేడియం లోని బౌలర్స్ ఎండ్ కి పెట్టడంతో ప్రతి ఒక్కరూ బీజేపీ సర్కార్ ని దుయ్యబడుతున్నారు.బౌలర్లు పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేస్తారు.

ఐతే పరిగెత్తుకుంటూ వచ్చే ఆ ప్రదేశాన్ని ఎండ్ అని పిలుస్తుంటారు.వీటికి స్వతంత్ర సమరయోధుల పేర్లనో లేక ప్రముఖ క్రికెటర్ల పేర్లనో పెడతారు కానీ అసలు క్రికెట్ తో సంబంధంలేని పారిశ్రామిక వేత్తల పేర్లు అయిన రిలయన్స్ ఎండ్ అని ఒకవైపు, అదాని ఎండ్ అని మరోవైపు నామకరణం చేయడం తో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది.

Telugu Adani, Cricket, Gujarat, Motera, Narendra Modi, Netizens, Pm Modi, Relian

గతంలో కాంగ్రెస్ పార్టీ నేతల ( ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ) పేర్లను వారు దివంగతులైన తర్వాతనే స్టేడియాలకి, విమానాశ్రయాలకి పెట్టారు.కానీ నరేంద్రమోడీ బ్రతికి ఉన్నప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరు ని తీసేసి నరేంద్ర మోడీ అనే పేరును పెట్టారు.ఇది చాలదన్నట్టు అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగే పారిశ్రామికవేత్తల పేర్లు కూడా పెట్టడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube