మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏమిటో తెలుసా?

మానవుని జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దైవ అనుగ్రహం లేనిదే జరగదని చెబుతుంటారు.మన జీవితంలో ఆరోగ్యం, సౌభాగ్యం, దీర్ఘాయుష్షు, మంచి మనల్ని రక్షించేది మంత్రం మహామృత్యుంజయ మంత్రం.

 Why The Mahamrityunjaya Mantra Is Chanted-TeluguStop.com

ఈ మంత్రం తరచూ పట్టించడం వల్ల అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చు.దీనిని శుక్లయజుర్వేద మంత్రం అని కూడా పిలుస్తారు.

శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.ఈ మహా మృత్యుంజయ మంత్రం ఎంతో పవిత్రమైనది.

 Why The Mahamrityunjaya Mantra Is Chanted-మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించిన కాలకూట విషాన్ని సేవించిన ఆ పరమశివుడు మృత్యువును జయించి మృత్యుంజయుడుగా పేరుపొందాడు.అటువంటి విశిష్టత కలిగిన ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వారిపై ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండి వారు కూడా మృత్యుంజయులు అవుతారని పండితులు చెబుతున్నారు.

మహా మృత్యుంజయ మంత్రాన్ని సంజీవని మంత్రం అని కూడా చెబుతారు.మన జీవితంలో ఏదైనా ఆపదలు కలిగినప్పుడు, అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు, లేదా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల అకాల మరణం నుంచి బయటపడవచ్చు.

“ఓం త్రయంబకం యజామహే! సుగంధిం పుష్టి వర్ధనం! ఉర్వారుక మివ బంధనాత్! మృత్యోర్ ముక్షీయ మామృతాత్!”మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న ప్రమాదాలు, సమస్యలు, దుష్టశక్తులను తరిమికొట్టడమే కాకుండా ఈ మంత్రం మనకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది.మహా మృత్యుంజయ మంత్రాన్ని బ్రహ్మముహూర్తం లోనే 108 సార్లు చదవడం వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

#Life #Pooja #Lard Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

BREAKING/FEATURED NEWS SLIDE