లగడపాటి సర్వేలకు ఎందుకో ఇంత క్రేజ్ ..? చెప్పేవి నిజాలేనా ..?     2018-12-08   12:35:25  IST  Sai Mallula

ల్యాంకో రాజగోపాల్ .. ఆంధ్ర ఆక్టోపస్‌ … ఇలా అనేక పేర్లు తగిలించుకున్న లగడపాటి రాజగోపాల్ సర్వేలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఆయన సర్వేలు ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడమే ఈ డిమాండ్ కి కారణం. ఆయన గతంలో నిర్వహించిన అనేక సర్వేలను విశ్లేషిస్తే ఈ విషయం బయటపడుతుంది. గతంలో ఆయన చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. అందుకే… లగడపాటి ఎగ్జిట్‌ పోల్ సర్వేల స్పెషలిస్ట్ గా పేరు పొందాడు. అసలు నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ పై జాతీయ స్థాయి ఛానెల్స్ ఒకరకమైన ఫలితాన్ని ప్రకటించగా… లగడపాటి మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Why The Lagadapati Rajagopal Survey Is So Popular-Lagadapati Popular Telangana Poll Result

Why The Lagadapati Rajagopal Survey Is So Popular

తెలంగాణాలో లగడపాటి చేసిన సర్వే ను పరిగణలోకి తీసుకుంటే… కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు. అయితే 10 సీట్లు అటూ ఇటూ కావచ్చని ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌కు 58 సీట్లు రావచ్చని తెలిపారు. ప్రజా కూటమిలోని టీడీపీ 5 నుంచి 9 స్థానాల్లో గెలుస్తుందని లగడపాటి సర్వే తేల్చింది. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ… పది స్థానాల్లో టీఆర్ఎస్‌తో నేరుగా పోటీ చేసిందని..టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ చాలా టఫ్‌గా నడిచిందని లగడపాటి చెప్పారు. ఇక బీజేపీకి 7 సీట్లకు అటు ఇటుగా వస్తాయని, అలాగే మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 సీట్లు రావచ్చని, ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని ఆయన ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టారు.

Why The Lagadapati Rajagopal Survey Is So Popular-Lagadapati Popular Telangana Poll Result

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టే… టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లు 20కి పైగా స్థానాలు గెలుస్తున్నారని లగడపాటి వివరించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అంచనా వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు..లగడపాటి. అసెంబ్లీ రద్దు నాటి నుంచి తెలంగాణ ప్రజల అభిప్రాయం తరుచూ మారుతోందని చెప్పారు. అందుకే తెలంగాణలో వచ్చే రెండ్రోజుల పాటు పోస్ట్‌ పోల్‌ సర్వేలు చేస్తున్నట్లు వివరించారు. అయితే తెలంగాణ ఎన్నికలపై జాతీయ ఛానెళ్ళు ప్రచారం చేసిన సర్వే పలితాలను లగడపాటి కొట్టిపారేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు అంచనా వేసే విషయంలో జాతీయ స్థాయి ఛానెల్స్ ఎప్పుడూ తడబడుతూనే ఉన్నాయని లగడపాటి వెల్లడించారు.