‘‘ మీ వెనుక ఖలిస్తాన్ జెండాలు ఎందుకున్నాయి ’’.. వివాదంలో భారత సంతతి మహిళా నేత

న్యూయార్క్ స్టేట్ కార్యాలయానికి ఎన్నికైన మొట్టమొదటి భారత సంతతి అమెరికన్ జెనిఫర్ రాజ్‌కుమార్( Jenifer Rajkumar ) వివాదంలో చిక్కుకున్నారు.

సిక్కు డే పరేడ్‌కు( Sikh Day Parade ) అతిథిగా విచ్చేసిన ఆమె వారితో కలిసి దిగిన ఫోటో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా జెనిఫర్ మాట్లాడుతూ.సమానత్వం, ఐక్యత, కరుణ వంటి విలువలపై సిక్కు సమాజ నిబద్ధతను ప్రశంసించారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సిక్కు కమ్యూనిటీ ప్రముఖులతో ఆమె ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే సదరు ఫోటోలో ఆమె వెనుక ఖలిస్తాన్ జెండాలు( Khalistani Flags ) కనిపించడం దుమారం రేపింది.

జెనిఫర్ పోస్ట్‌పై ఓ ఎక్స్‌ (ట్విట్టర్ ) యూజర్ మండిపడ్డాడు.ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182ని పేల్చివేసి .329 మందిని చంపిన ఉగ్రవాదుల మద్ధతుదారులతో మీరు అనుబంధం పెంచుకోవడం ద్వారా ఈ భావజాలాన్ని సమర్ధిస్తున్నారని కామెంట్ చేశాడు.ఖలిస్తానీ వేర్పాటువాదులతో అనుబంధం పెంచుకోవడం ద్వారా మీరు హిందువులను నిరాశపరిచారు.

Advertisement
Why The Khalistani Flags Irked People Ask Indian-American Politician Jenifer Raj

పంజాబ్‌లో వేలాది మంది హిందూ మైనారిటీల నిర్మూలనకు ఈ సమూహాలు కారణమయ్యాయని , అలాంటి వారితో మీరు సహవాసం చేయడం సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డాడు.జెనిఫర్ రాజ్‌కుమార్ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి వున్నారు ఇంకో యూజర్ ఆరోపించారు.

Why The Khalistani Flags Irked People Ask Indian-american Politician Jenifer Raj

మరోవైపు .కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) పాల్గొన్న కార్యక్రమంలోనూ ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.ఆయన సమక్షంలోనే ‘‘ఖలిస్తాన్’’ అనుకూల నినాదాలు చేశారు.

ఖల్సా డే వేడుకల్లో భాగంగా ఆదివారం టొరంటో ( Toronto ) నగరంలో సిక్కు మతస్తులు పరేడ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జస్టిన్ ట్రూడోతో పాటు ప్రతిపక్షనేతలు, అధికారులు, సిక్కు కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో హాజరైంది.

ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతుండగా ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Why The Khalistani Flags Irked People Ask Indian-american Politician Jenifer Raj
నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

అయినప్పటికీ ట్రూడో తన ప్రసంగాన్ని కొనసాగించారు.సిక్కుల హక్కులు, స్వేచ్ఛను తాము ఎల్లప్పుడూ రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.భారత్-కెనడాల మధ్య విమాన రాకపోకలు పెరిగేందుకు కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

Advertisement

వైవిధ్యం కెనడా బలమని.భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ దేశం బలంగా వుందని ట్రూడో పేర్కొన్నారు.

సిక్కుల విలువలే కెనడా విలువలని .దేశవ్యాప్తంగా వున్న 8 లక్షల మంది కెనడియన్ సిక్కుల వారసత్వం కోసం, మీ హక్కులు, స్వేచ్ఛను రక్షించడానికి తాము ఎల్లప్పుడూ అండగా వుంటామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.

తాజా వార్తలు