ఆంజనేయుడి జెండా ఇంటిపై ఎందుకు పెడతారో తెలుసా?

సాధారణంగా మనం కొందరి ఇంటిపై ఆంజనేయస్వామి జెండా ఉండడం చూస్తుంటాము.అయితే ఇలాంటి జెండాలు కేవలం ఆలయం లేదా పూర్వంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో రాజులు తమ రథానికి ఇలా జెండా లు పెట్టేవారు.

 Flag Of Anjaneya, Worship, Hindu Belives, Trusts, Arjuna-TeluguStop.com

ఇలా ఆంజనేయస్వామి జెండా పెట్టడం వల్ల యుద్ధంలో విజయం మనదే అవుతుంది.సాధారణంగా ఆంజనేయస్వామిని నమ్మకానికి విజయానికి బలానికి ప్రతీకగా విశ్వసిస్తారు.

అందుకోసమే ఏదైనా శుభకార్యానికి వెళ్లేముందు ఈ జెండా తీసుకు వెళ్లడం వల్ల తప్పకుండా విజయం వరిస్తుందని భావిస్తారు.

 Flag Of Anjaneya, Worship, Hindu Belives, Trusts, Arjuna-ఆంజనేయుడి జెండా ఇంటిపై ఎందుకు పెడతారో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే పురాణాల ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథాన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుడు నడుపుతాడు రథానికి ఆంజనేయస్వామి జెండా కట్టమని హనుమంతుడు చెప్పడంతో స్వయంగా శ్రీ కృష్ణుడు తన రథానికి జెండా కట్టి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి పాండవులు విజయం పొందారు.

ఇలా పాండవులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ విజయం పొందాలని ఈ జెండాను ఉపయోగిస్తారు.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉంటారు.

అలా ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

సాధారణంగా ఆంజనేయస్వామి ఎంతో బలవంతుడు కావడంతో ఎలాంటి భూత పిశాచీలనైనా తన కాళ్ళ కింద బంధించి వారిని నాశనం చేస్తాడు.అందుకోసమే ఏ విధమైనటువంటి గాలి, భూత,పిశాచులు మన ఇంటి లోనికి రాకుండా అడ్డుగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి పైభాగంలో ఆంజనేయస్వామి జెండా కట్టి ఉంటారు.ఇలాంటి జెండా ఇంటి ముందు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ శనిదోషం కానీ లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు ఇంటి పై భాగంలో ఆంజనేయస్వామి జెండా ఉంచుతారు.

Flag Of Anjaneya, Worship, Hindu Belives, Trusts, Arjuna - Telugu Flag Anjaneya, Hindu, Worship #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube