టీడీపీ సీనియర్లలో ఈ వైరాగ్యం ఏంటి ?

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వడిదుడుకులన్నీ ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండడం అదే సమయంలో కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించుకుని ప్రధాన ప్రతిపక్షం వలే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుండడంతో పాటు దూకుడుగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

 Why Tdpsenior Leaders Are So Silent-TeluguStop.com

ఈ సమయంలో పార్టీకి అన్ని విధాలా సహాయ సహారాలు అందిస్తూ పార్టీకి ఉపయోగపడేలా సలహాలు, సూచనలు చేస్తూ పార్టీకి అండగా ఉండాల్సిన టీడీపీ సీనియర్లు ఇప్పుడు మొహం చాటెయ్యడంపై టీడీపీ లో తీవ్రంగానే చర్చ జరుగుతోంది.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి తమ గొంతు పెంచి మాట్లాడిన నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అవ్వడం అధినేత చంద్రబాబు కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.

రిటైర్మెంట్ వయస్సు దాటిపోయినా పార్టీని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రజా ఉద్యమాలు చేపడుతున్నాడు.అయినా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఒకరకంగా చెప్పుకోవాలంటే టీడీపీకి ఇప్పుడు కష్టకాలమే నడుస్తోంది.అధికార పార్టీకి భారీ స్థాయిలో సీట్లు దక్కడంతో టీపీడీ నేతలు డీలాగా కనిపిస్తూ టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది మొహం చాటేస్తున్నారు.

అధికార పార్టీ వైఫల్యాల మీద మీడియా ఛానెళ్లలో పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Telugu Amaraathi, Chandrababu, Tdp Senior, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే ప్రతిపక్ష పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది.కానీ టీడీపీ లో గట్టిగా వాయిస్ వినిపించే వారు ఉన్నా వారంతా సైలెంట్ గా ఉండడం వెనుక కారణాలు ఎవరికీ అర్ధం కావడంలేదు.ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు టీవీ చర్చా కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో అనవసరంగా అధికార పార్టీ మీద విమర్శలు చేసి వారికి టార్గెట్ అవ్వడం ఎందుకు అన్న కోణంలో మెజార్టీ సీనియర్లు ఉన్నట్టు కనిపిస్తోంది.అందుకే ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు ముందు తాము సేఫ్ గా ఉంటే చాలు అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తాము సేఫ్ పొజిషన్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube