తెలుగుదేశంలో 'ఎంపీ'.. సీటా మాకొద్దు బాబోయ్..!!

తెలుగు దేశం పార్టీ నుంచీ పోటీ చేయాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి, పెట్టి పుట్టాలి, అసలు టిక్కెట్టు రావడం కూడా గగనం, చంద్రబాబు దృష్టిలో పడాలని ,టిక్కెట్టు సంపాదించాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో మంది నేతలు.అయితే అదంతా గతం ఇప్పటి పరిస్థితిలో మాత్రం తెలుగు దేశం పార్టీ నుంచీ టిక్కెట్టు అంటేనే నేతలు భయపడిపోతున్నారట.అదేంటి టిక్కెట్ల కోసం అభ్యర్ధులు అధినేత ముందు బారులు తీరుతున్నారు కదా అంటే…

 Why Tdp Candidates Not Interested About Mp Tickets-TeluguStop.com

టీడీపీ నుంచీ నేతలు ఆశిస్తోంది కేవలం అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమేనట , ఎంపీ స్థానాలకి మాత్రం ఎవరికీ వారు ముఖాలు చాటేస్తున్నారట.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ అభ్యర్ధులు సైతం తమకి ఎంపీ సీట్లు వద్దు, ఈ సారి అసెంబ్లీ కి వెళ్తామని తెగేసి చెప్తున్నారట దాంతో ఏమి చేయాలో చంద్రబాబు కి అర్థం కాక తలపట్టుకున్నారని తెలుస్తోంది.అసలు ఎందుకు ఎంపీ సీట్ల విషయంలో వెనకడుగు వేస్తున్నారు…???

గత కొంతకాలంగా ఏపీలో పార్టీల పరిస్థితిపై పలు రకాల సర్వేలు ఇస్తున్న రిజల్స్ చూస్తుంటే నేతలకి వణుకు పుడుతోందట.టీడీపీ ఎంపీ స్థానాలని గెలుచుకోవడంలో సింగల్ డిజిట్ ని దాటే పరిస్థితి లేదని చెప్పడంతో నేతలు అందరూ ఎంపీ గా కంటే ఎమ్మెల్యే గా పోటీ చేయడమే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట.

అందులో భాగంగానే ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుపైనే పోటీచేయడానికి ముందుకొస్తున్నారని చంద్రబాబు ఎంత చెప్పినా సరే ససేమిరా అంటున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే తాజా పరిణామాలతో ఇప్పుడు టీడీపీ అధినేత గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభంచారట.తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి వైసీపీకి గూటికి చేరిపోవడంతో ఈ అనుమానాలకి మరింత బలం చేకూరిందట.అయితే వైసీపీలోకి మరింత మంది ఎంపీలు కూడా చేర అవకాసం ఉందని తెలియడంతో పాటు వారు మరింత మంది ఎమ్మెల్యే లని కూడా తమతో తీసుకువెళ్తారని సమాచారం ఉండటంతో చంద్రబాబు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube