ఎస్వీఆర్ ఎందుకు బెత్తం దెబ్బలు తిన్నాడో తెలుసా?

ఎస్వీ రంగారావు.తెలుగు తెర చేసుకున్న పుణ్యం కారణంగానే ఆయన సినిమా నటుడిగా జన్మించాడేమో అనిపిస్తుంది.

 Why Svr Grand Mother Beaten Him, S.v Ranga Rao , Tollywood , Grand Mother Beaten-TeluguStop.com

నిండైన రూపంతో సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేశాడు ఎస్వీఆర్.ఆయన మాటలు, నటన అత్యద్భుతంగా ఉండేది.

ఆయన నటన ముందు సూపర్ స్టార్లుగా పిలిపించుకునే వారంతా దిగదుడుపే అనేలా చేశాడు.ఆయన హావభావాలను చక్కటి మాటతీరుతో ఏ క్యారెక్టర్ ఇచ్చానా నటించి మెప్పించేవాడు ఆయన.ఆయన నటన ముందు ఇతర నటులంతా తేలిపోయేవారు.ఆయనతో కలిసి నటించాలంటేనే భయపడేవారు.

Telugu Character, Characters, Grandmother, Tollywood-Movie

సినిమా థియేటర్లలో ఎస్వీఆర్ తెర మీద కనిపిస్తే చాలు జనాలు చప్పట్ల మోత మోగించేవారు.ఈలలతో గోలలు చేసేవారు.ఆయన నటన చూసి మైమరిచి పోయేవారు.ఆయన తల కొద్దిగా ఆడిస్తే చాలా జనాలు రచ్చ రచ్చ చేసేవారు.గాంభీర్యమైన సంభాషణలు, దానికి మించిన ముఖకవలిలతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే వాడు.అందుకే అందుకే ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, మాంత్రికుడు, హిరణ్య కశిపుడు, తాత, తండ్రి, మామ ఒకటేమిటీ ఎన్నో క్యారెక్టర్లను అవలీలగా చేశాడు ఆయన.చివరి శ్వాస వరకు నటనే జీవితంగా బతికాడు ఆయన.

Telugu Character, Characters, Grandmother, Tollywood-Movie

ఎస్వీఆర్ బాగా చదివించాలని వాళ్ల నాయనమ్మ చైన్నైలో ఇల్లు అద్దెకు తీసుకుంది.హిందూ స్కూల్ లో జాయిన్ చేసింది.కానీ ఆయనకు చదువు అంటే పెద్దగా నచ్చేది కాదు.

సినిమాలంటేనే ఎంతో ఇష్టం ఉండేది.అందుకే ప్రతిరోజు సెకెండ్ షోకు వెళ్లేవాడు.

ఇందుకోసం ముందు గదిలో పడుకునేవాడు.ఒక రోజు కరెంటు పోయింది ఆ సమయంలో ఆయనను లేపడానికి నాయనమ్మ వెళ్లింది.

కానీ ఎస్వీఆర్ లేడు.అప్పటికే సినిమాకు వెళ్లాడు.

ఆయన స్థానంలో దిండు పెట్టి వెళ్లాడు.వాళ్ల నాయనమ్మకు ఎంతో కోపం వచ్చింది.

ఎస్వీఆర్ వచ్చే వరకు అక్కడే కూర్చుంది.రాగానే బరిగె తీసుకుని నాలుగు చప్పరించింది.

ఆ తర్వాత దెబ్బలకు వెన్నరాస్తూ బాధపడింది.అయినా ఎస్వీఆర్ కు తనంటే ఎంతో ప్రేమ.

తను చనిపోయేంత వరకు ఆమెపై రంగారావు ఆ ప్రేమను కొనసాగించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube