సూర్యకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు?

తమిళ స్టార్ హీరో సూర్య సినిమా అంటే సౌత్‌ ఇండస్ట్రీల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి.కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూర్య చిత్రాలకు ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.

 Why Suriya Signing Movies Without Gap-TeluguStop.com

ఇక ఈ హీరో గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి మనకు తెలిసిందే.అయినా కూడా సూర్య తన జోరును ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు.

ఇప్పటికే డైరెక్టర్ హరితో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసని సూర్య, తన 40వ చిత్రాన్ని మరో డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇక ఈ సినిమా మొదలు పెట్టకముందే మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ పాండిరాజ్‌తో కలిసి సూర్య తన 41వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇలా గ్యాప్ లేకుండా సినిమాలను లైన్‌లో పెడుతున్న సూర్య, ఒక్క హిట్ కూడా ఇవ్వకపోవడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

ఇకనైనా సూర్య వేగంగా సినిమాలు చేయకుండా సరైన కథాకథనాలతో సినిమాల ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.ఏదేమైనా సూర్య వరుసగా సినిమాలు చేస్తుండటంతో తమిళంలో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

మరి సూర్యకు అదిరిపోయే సక్సెస్‌ను ఏ దర్శకుడు అందిస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube