ఏఎన్ఆర్ క్యారెక్టర్ నాగార్జున, చైతన్య కి ఇవ్వకుండా...సుమంత్ కి ఎందుకు ఇచ్చారు.? బాలయ్య చెప్పిన కారణం ఇదే.!     2019-01-07   09:33:28  IST  Sai Mallula

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. తన తండ్రి జీవితకథను బయోపిక్‌గా ఆయన రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యాబాలన్, రానా, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది.

Why Sumanth Playing ANR Role In NTR Biopic-Balakrishna Ntr Biopic

Why Sumanth Playing ANR Role In NTR Biopic

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు గారి పాత్ర సుమంత్ పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే నాగేశ్వర రావు గారి పాత్రకోసం నాగార్జునని తీసుకొచ్చు కదా అని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై బాలయ్య బాబు గారు ఏమని స్పందించారంటే..‘సుమంత్‌తో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర చేయించాం. నాగార్జున కన్నా సుమంత్‌లో ఏఎన్ఆర్ పోలికలు ఎక్కువ.

Why Sumanth Playing ANR Role In NTR Biopic-Balakrishna Ntr Biopic

పైగా తాత దగ్గర పెరగడంతో, ఆయన పాత్రలో లీనమైపోయాడు. ఆ పాత్ర పోషిస్తే చాలు.. కానీ ఆయన శైలినీ, డైలాగ్‌ డెలివరీనీ అనుకరించవద్దని చెప్పా. అలాగే చేశాడు. ఎన్టీఆర్‌, ఏయన్నార్ల జర్నీని సినిమాలో ఎక్కువగా చూపించాం. మధ్యలో వాళ్ళ మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చి ఉండవచ్చు. అవి ఎక్కడైనా సహజం. కానీ, వాళ్ళ స్నేహానుబంధాన్నే చూపించాం’’ అన్నారు.