విఠలాచార్య వచ్చి అడిగిన కూడా ఎన్టీయార్ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు ?

1967 సమయంలో సౌత్ ఇండియాలోనే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకుడిగా విఠలాచార్య రికార్డుల్లోకి ఎక్కారు.ఆయన దర్శకుడు కావాలని ఏ రోజు అనుకోలేదు.అన్ని అవసరం కోసం మాత్రమే చేశారు.1943 సమయంలో అందరి యువకుల లాగానే స్వాతంత్య్రం కోసం కోట్లాది మూడు మార్లు జైలుకు వెళ్లారు.ఉడిపి లో పుట్టిన విఠలాచార్య సినిమాలో కళ కంటే వ్యాపారమే ఎక్కువగా ఉందని నమ్మిన వ్యక్తి.ఇక ఏదైనా వ్యాపారం చేయాలని భావించి, తుండు గుడ్డ తో కర్ణాటక వచ్చి, అక్కడ సినిమా పిచ్చిని తగిలిచుకున్నాడు.

 Why Sr Ntr Rejected Vitalacharya Movie Offer Details, Director Vithalacharya, Ja-TeluguStop.com

మొదట టూరింగ్ టాకీస్ బిజినెస్ చేశారు.ఆ తర్వత కొంత మంది స్నేహితులను కలుపుకొని కన్నడ సినిమాలను రిలీజ్ చేయడం మొదలెట్టారు.

ఈ క్రమంలో జానపద చిత్రాలు ఆయనను బాగా ఆకర్షించాయి.ఆయన ఒక దర్శకుడి తో సినిమా తీస్తుండగా, అతడు హ్యాండ్ ఇవ్వడం తో దర్శకుడిగా మారారు విఠలాచార్య.

అయన సినిమాల్లో ఎలాంటి జిమ్మిక్కులు, గ్రాఫిక్స్ ఉండవు, అయినా కూడా దయ్యాల సినిమాలను చేయడానికి ఆయనకు ఎవరు సాటి లేరు.ఆలా ఏకంగా 55 సినిమాలకు దర్శకత్వ వహించి జానపద బ్రహ్మ గా పేరు గడించాడు.

కానీ ఆయన తో ఒక సందర్భంలో ఎన్టీయార్ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.ఆ సంగతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Vithalacharya, Janapada Brahma, Nandamuritaraka, Sr Ntr, Sr Ntr Dates, To

వాస్తవానికి విఠలాచార్య హీరోల డేట్స్ తక్కువే తీసుకుంటాడు.ఎందుకంటే అయన ఒక బడ్జెట్ మనిషి కాబట్టి.హీరో డేట్స్ తక్కవ తీసుకొని సినిమాను అనుకున్న టైం లో పూర్తి చేయడం ఆయనకు అలవాటు.ఆ క్రమం లో అన్న ఎన్టీఆర్ తో ఒక సినిమా తీయాలని అడగగా, ఒక వారం మాత్రమే డేట్స్ ఉన్నాయి అని చెప్పాడట.

దాంతో ఆ వారం డేట్స్ నాకు చాలు, అవి నాకు ఇచ్చేయండి సినిమా తీస్తాను అని అడిగితే ఎన్టీఆర్ భయపడ్డరట.వారంలో సినిమా ఎలా అవుతుంది, కొంత షూటింగ్ చేశాక హీరో కి శాపం పెట్టేసి సినిమా లో కనిపించక ముందే పూర్తి చేస్తాడేమో అని భయం వేసి ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube