వందలో 70 శాతం మంది మగాల్లు ఎదుర్కొంటున్న సమస్యకు.. చాలా సులభమైన పరిష్కారం ఇది  

Why Counts Are Dropping For Men-

ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా మగాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండటం. అదేం అనారోగ్య సమస్య అయితే కాదు, కాని పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే స్పెర్మ్‌ కౌంట్‌ పెంచేందుకు ఎన్నో రకాల మందులు వచ్చాయి...

వందలో 70 శాతం మంది మగాల్లు ఎదుర్కొంటున్న సమస్యకు.. చాలా సులభమైన పరిష్కారం ఇది-Why Sperm Counts Are Dropping For Men

అయితే స్పెర్మ్‌ కౌంట్‌ను మందులతో కాకుండా సాదారణ పద్దతుల్లో కూడా పెంచుకోవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం చేసే పనుల వల్ల ఆ సమస్య ఏర్పడుతుందని తెలుసుకున్న వైధ్యులు, ఆ తప్పులు చేయకుండా ఉంటే ఆ కౌంట్‌ ఆటోమేటిక్‌ గా పెరిగి పోతుందని అంటున్నారు.

మనం ప్రతి రోజు తినే ఆహారం, మనం చేసే పని వల్ల అనారోగ్య సమస్యలు ఎలా అయితే వస్తాయో అలాగే ఈ కౌంట్‌ కూడా మనం చేసే పనుల వల్లే తగ్గుతుంది.

అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉంటంతో పాటు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినకుండా, స్మోకింగ్‌ చేయకుండా దూరంగా ఉండాలి. ఇక కంప్యూటర్‌ వర్క్‌ చేసే వారు, ముఖ్యంగా గంటలకు గంటలు కంప్యూటర్‌ ముందు కూర్చుని వర్క్‌ చేసే వారు, ల్యాప్‌ టాప్‌ను తొడలపై పెట్టుకుని వర్క్‌ చేసే వారు వెంటనే జాగ్రత్త పడండి. ల్యాప్‌ టాప్‌ తొడలపై పెట్టుకుని వర్క్‌ చేయడం అనేది అత్యంత ప్రమాదకర విషయం.

ఆ వేడి వల్ల స్పెర్మ్‌ దెబ్బ తినే అవకాశం ఉందని వైధ్యులు చెబుతున్నారు. ల్యాప్‌ టాప్‌ మరియు కంప్యూటర్‌ లకు కాస్త దూరంగా ఉంటూ వర్క్‌ చేసుకోవచ్చు.

ఇక స్పెర్మ్‌ కౌంట్‌ పెరిగేందుకు యోగా మంచి మందని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగా కూడా నిరూపితం అయినట్లుగా చెబుతున్నారు.

స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుదలకు నిత్యం యోగా చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైధ్యులు ప్రయోగాలు చేసి నిరూపించారు. మందుల ప్రభావం కంటే కూడా అధికంగా యోగా ప్రభావం ఉందని చెబుతున్నారు. యోగా వల్ల కేవలం కౌంట్‌ పెరగడం మాత్రమే కాకుండా ఒత్తిడిని జయించవచ్చు...

ఇక మనిషిలోని డీఎన్‌ఏ క్వాలిటీ కూడా పెంచడంలో యోగా కీలక భూమిక పోషిస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనిషికి మాత్రమే సాధ్యమయిన యోగాను అంతా చేయడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అందుకే యోగా అవగాహణకు ఈ విషయాన్ని షేర్‌ చేయండి