బాలయ్య తో సినిమా చేయడానకి సౌందర్య ఎందుకు ఒప్పుకోలేదు

అవి ఇంద్ర సినిమా ఘనవిజయం సాధించి రాయలసీమ పురుషాన్ని ప్రపంచానికి సాటినా రోజులు.ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ.

 Why Soundarya Rejected Chenna Keshava Reddy Details, Chenna Keshava Reddy, Sound-TeluguStop.com

ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరొక యాక్షన్ తో కూడిన ఫ్యాక్షన్ సినిమా తీయాలని బాలకృష్ణ వివి వినాయక్ ని కోరాడు.అప్పటికే ఆది లాంటి ఒక సినిమా తీశాడు కాబట్టి వి వి వినాయక్ అయితే చిరంజీవి ఇంద్రను మించేలా ఒక సినిమాను తీస్తాడని బాలకృష్ణ గట్టిగా నమ్మాడు.

అనుకున్నదే తడవుగా సినిమాకి చెన్నకేశవ రెడ్డి పేరు కూడా పెట్టేశారు.అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ముందే అనౌన్స్ చేశారు ఈ సినిమా పేరుతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది కొత్తదనం కనిపించడంతో ఒకింత ఉత్సాహాన్ని పెంచింది.

ఖచ్చితంగా ఇంద్రను మించి హిట్ అవుతుందని అంతా భావించారు.అంతేకాదు ఈ సినిమాలో డబల్ యాక్షన్ కూడా ఉండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.తండ్రి పాత్రలో బాలకృష్ణకు జోడిగా హీరోయిన్ టబు ని తీసుకోగా, కొడుకు బాలకృష్ణ పాత్ర కోసం సంతోషం వంటి హిట్ సినిమాలో నటించిన శ్రీయాని హీరోయిన్ గా ఎంచుకున్నారు.అయితే టబు నటించిన పాత్ర కోసం అమే కన్నా ముందు ఆ పాత్రని వివి వినాయక్ సౌందర్యతో చేయించాలని భావించాడు.

Telugu Balayya, Chennakeshava, Vv Vinayak, Indra, Shreya, Soundarya, Tabu, Tolly

ఎందుకంటే సౌందర్య నటించిన దాదాపు పదికి పైగా సినిమాలకు వివి వినాయక్ అసిస్టెంట్ గా పని చేశాడు.ఆ పరిచయంతో బెంగుళూరు కి వెళ్లి మరి సౌందర్య కి కథను వినిపించాడట.కానీ అప్పటికే హీరోయిన్ గా ఇంకా మంచి స్థాయిలో ఉన్న సౌందర్య రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు.ఇప్పుడే అలాంటి పాత్రలు వేస్తే ముందు ముందు కూడా అలాంటి పాత్రలే వస్తాయని ఆమె భావించి రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేను అంటూ వీవి వినాయక్ ని తిప్పి పంపించింది.

దాంతో ఆ పాత్ర టబు చేతికి వెళ్ళగా ఆమె ఒప్పుకుంది.

Telugu Balayya, Chennakeshava, Vv Vinayak, Indra, Shreya, Soundarya, Tabu, Tolly

కానీ చెన్నకేశవ రెడ్డి సినిమాను ఇంద్ర చిత్రం తో పోల్చి చూడడంతో కంపారిజన్ ఎక్కువైపోయి ఒకింత డీలపడిన మాట వాస్తవమే కానీ యావరేజ్ గా టాక్ తో 40 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సినిమా ఫెయిల్యూర్ కి మాత్రం ఒకే ఒక రీజన్ ని అందరూ గట్టిగా చెబుతారు.సినిమా రిలీజ్ డేట్ ముందే చెప్పేయడంతో హడావిడిగా షూటింగ్ పూర్తి చేశారు.

కథనం సరిగ్గా పోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది.అంతేకాదు సినిమా విడుదలైన తర్వాత ఒక పాటను రీ షూట్ చేసి మరి మళ్ళీ జోడించి విడుదల చేశారు ఏది ఏమైనా ఈ సినిమా సౌందర్య చేయకపోవడమే మంచిదయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube