ఎందుకు సంక్రాంతికి పోటీ ఇంత తీవ్రం.. పరిణామాలు ఏంటో!

సంక్రాంతి 2022 కి విడుదల అవ్వబోతున్న సినిమా ల జాబిత చాలా పెద్దగానే ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ మొదలుకుని ఇటీవలే మొదలు అయ్యి షూటింగ్ ముగించుకునేందుకు సిద్దం అయిన బంగార్రాజు వరకు చాలా సినిమాలు కూడా సంక్రాంతికి వస్తామంటూ సందడి చేస్తున్నాయి.

 Why So Many Movies Coming For Sankranthi  Details, Sankranthi 2022 Releasing Mov-TeluguStop.com

రికార్డు స్థాయి లో ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేసి బాహుబలి మించిన వసూళ్లను దక్కించుకోవాలని జక్కన్న అండ్‌ టీమ్‌ భావిస్తున్నారు.అందుకు గాను రెండు వారాలు కనీసం ఇతర సినిమా లు ఏమీ కూడా ఉండకూడదు.

అప్పుడే దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కుమ్మేయడం ఖాయం.కాని భీమ్లా నాయక్.

రాధే శ్యామ్‌ మరియు బంగార్రాజు సినిమా లు వారం గ్యాప్ లోనే రాబోతున్నాయి.కనుక ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు నాలుగు కూడా అభిమానులు చూడాలనుకుంటున్నారు.రెండు వారాల గ్యాప్ లో నాలుగు సినిమా లు చూడటం అంటే ఖచ్చితంగా ఎవరికి అయినా సాధ్యం అయ్యే విషయం కాదు.

కనుక అందరు ఈ నాలుగు సినిమాలు చూస్తారు అనుకుంటే పొరపాటు అవుతుంది.పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఏ సినిమాలను చూసే వారు ఆ సినిమాలనే చూస్తారు.

Telugu Bangarraju, Bheemla Nayak, Nagarjuna, Prabhas, Radeshyam, Radhe Shyam, Ra

కనుక మరో సినిమా భారీగా నష్టపోవాల్సి వస్తుంది.ఈ పరిణామాలకు కారణం ఏంటీ అంటే కరోనా వల్ల దాదాపుగా 15 నెలల పాటు సినిమాలు విడుదలకు అవకాశం లేకుండా పోయింది.మొన్నటి వరకు భయం భయంగానే పరిస్థితి ఉంది.కనుక ఇప్పుడు తమ సినిమాలను వదిలేందుకు ముందుకు వస్తున్నారు.జనవరి లో కాకుండా మళ్లీ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.అందుకే అప్పటి వరకు వెయిట్ వద్దనే ఉద్దేశ్యంతో సంక్రాంతికే ఈ నాలుగు సినిమాలు వస్తాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube