ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకంత ప్రీతో తెలుసా?

మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు.ఈ మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలను అందిస్తుంటారు.

 Why Sindhuram Is Dear To Hanuman, Anjaneya Swami, Sindhuram, Sriram, సిం�-TeluguStop.com

ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్యసాహసాలతో ఉంటారు.అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు.

అంతేకాకుండా ఈ స్వామివారిని పూజించే వారు ఎక్కువగా సింధూరంతో పూజిస్తుంటారు.అసలు ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో ఇక్కడ తెలుసుకుందాం…

ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు అనే విషయం మనందరికీ తెలిసినదే.

వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రుల వెంట హనుమంతుడు కూడా అయోధ్యకు చేరుకుంటాడు.ఆ విధంగా అయోధ్యలో ఒక రోజు తన పనులన్నింటిని ముగించుకొని ఎంతో ఆకలితో అంతఃపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడిగాడు.

అప్పుడే స్నానాదికాలు పూర్తిచేసుకుని సీతాదేవి హనుమంతుడిని ఉద్దేశించి”హనుమా.కాసేపు ఆగు మొదట పాపిటలో సిందూరం పెట్టుకొని తర్వాత భోజనం వడ్డిస్తానని” చెప్పారు.

ఆ విషయం విన్న హనుమంతుడు అమ్మ… పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు వేశాడు.ఈ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని, ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ది కలుగుతుందని తెలియజేసింది.అలా సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు అక్కడినుంచి వెళ్లిపోయారు కొద్దిసేపటి తరువాత శరీరమంతా సింధూరం పూసుకుని తిరిగి అయోధ్యకు వస్తాడు.

ఒక్కసారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీత,హనుమ ఎందుకు శరీరమంతా సింధూరం పూసుకున్నావని అడుగగా.

ఇలా సింధూరం దర్శిస్తే శ్రీరామచంద్రుడుకి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావు కదా అని చెప్పడంతో హనుమంతుడికి శ్రీరాముని పై ఉన్న భక్తి భావానికి సంతోషించి మంచి హృదయంతో హనుమంతుని ఆశీర్వదిస్తుంది.ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు భక్తికి నువ్వు ఒక ఉదాహరణగా చెప్పవచ్చని, ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుంచి నేను కాపాడతానని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తెలియజేశారు.

అప్పటినుంచి ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరమైనదని భావించి పూజలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube