ఉప్పును చేతికి ఇవ్వకూడదని మన పెద్దలు చెప్పుతారు....ఎందుకు?  

  • సాధారణంగా ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఒకవేళ ఉప్పును చేతికి ఇస్తే ఆ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని పూర్వ కాలం నుండి ఒక నమ్మకం ఉంది. ఈ విషయంలో నిజానిజాలు ఏమిటో తెలుసుకుందాం.

  • శ్లో. గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ

  • రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః

  • దశ దానాల్లో ఉప్పు అనేది ఒకటి. శని దానాలలో, పితృ కార్యాలలో ఉప్పును దానం ఇస్తూ ఉంటారు. కనుక ఉప్పు అశుభానికి గుర్తు. అందువల్ల ఉప్పును చేతికి ఇవ్వకూడదని అంటారు. అదే కాకుండా ఉప్పందించడం అని అంటారు. ఉప్పందించడం అంటే ఒకరి రహస్య సమాచారాన్ని వారిని మోసం చేసి మరొకరికి చెప్పటం. అందువల్ల ఈ కారణం చేత కూడా ఉప్పు చేతికి అందించరు.