గుడిలో గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా?

హిందూమతంలో ఏదైనా పూజ లేదా కర్మ సమయంలో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉందని చెబుతారు.అయితే గుడిలో గంటకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

 Why Should We Ring The Bell In Temple-TeluguStop.com

గుడిలో హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడుతూ ఉంటారు.ఇలా గంట మోగడం శుభ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.

హిందూ దేవాలయాల్లో ప్రవేశద్వారం వద్ద ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది.దర్శనానికి వెళ్లే భక్తులు గంటలు మోగించి గుడిలోకి ప్రవేశిస్తారు.

 Why Should We Ring The Bell In Temple-గుడిలో గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూజ, యజ్ఞం, హారతి, దేవత ముందు దూపం కర్పూరం వెలిగించేటప్పుడు కూడా గంట మోగిస్తూ ఉంటారు.హిందూమతంలో గంటకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.గంట లో ఉండే ప్రతి భాగానికి ఒక్కో అర్థం దాగి ఉంది.గంట యొక్క వక్ర శరీరం అనంతంను సూచిస్తుంది.

గంట శబ్దం లేదా నాలుక జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని సూచిస్తుంది.గంట పిడికిలి భాగం హనుమంతుడు, గరుడు, నంది, సుదర్శన చక్రాలతో ప్రతీకగా ముడిపడి ఉంది.

తద్వారా ఇది మరింత గ్రహణ శక్తిని పెంచుతుంది.

గంట యొక్క శబ్దం శుభ సూచికంగా పరిగణించబడుతుంది.

ఇది దైవత్వాన్ని స్వాగతించి, చెడును తొలగిస్తుంది.గంట శబ్దం కొనసాగుతున్న ఆలోచనల నుండి విడదీస్తుంది.

ప్రార్థన సమయంలో గంట మోగించడం అనేది ఎప్పటికప్పుడు తిరుగుతున్న మనసును ఆ దేవదేవతులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.హారతి సమయంలో దేవుళ్లను ఆహ్వానిస్తున్నామని చెప్పేందుకే గంట కొడతారు.అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో దేవుని చూపిస్తారు.అందువల్ల హారతి ఇచ్చే సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా ప్రత్యక్షంగా దేవుని దర్శించుకోవాలని పురోహితులు చెబుతున్నారు.

గుడిలో గంట కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు: గంట శబ్దం మానవ శరీరంలోని ఏడు చక్రాలను సక్రియం చేస్తుంది.ఇది ఎడమ, కుడి మెదడు మధ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది.

గంట శబ్దం దేవతల సూత్రాన్ని నిలుపుకుంటుంది, అంతేకాకుండా దుష్ట శక్తులను దూరం చేస్తుంది.ఈ శబ్దం మనసు ఇంకా ఆత్మను ప్రశాంతంగా చేసి ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది.

#Temple Bell #Hindu Temple #Hindu Ritual #Harathi #Temple Bell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL