సాయంత్రం సమయంలో తలుపులు తీసి ఉంచాలి.... ఎందుకో తెలుసా?  

  • మన పెద్ద వారు సాయంత్రం సమయంలో తలుపులు మూయకూడదు అని అంటారు. దీనికి ఒక కారణం ఉంది. సాయంకాలం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం వైపునుంచీ, మహాలక్ష్మి సింహద్వారం నుంచీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంద్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీ దేవి ఆగమనానికి స్వాగతం పలకాలి. ఆ సమయం లో తప్పనిసరిగా వెనుక వైపు తలుపులు మూసి ఉంచాలి.

  • మన పెద్దవారు ఏమి చెప్పిన మన మంచి కోసమే చెప్పుతారు. వాటిని మూఢ నమ్మకం అని కొట్టిపారేయకుండా పాటించటం మంచిది.