కరివేపాకు.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.ఎందుకంటే.ప్రతి ఒక్కరి పెరటిలోనూ కరివేపాకు ఉంటుంది.వంటల్లో విరివిరిగా వాడే కరివేపాకు.కూరకు చక్కటి రుచి ఇవ్వడంతో పాటు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూర్చుతుంది.
కానీ, కొందరు మాత్రం కరివేపాకే కదా అని కూరల్లో తీసి పక్కనపారేస్తుంటారు.ఇలా చేయడం చాలా పొరపాటు.
వాస్తవానికి కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, కాండం పై బెరడు, వేరు పై బెరడు ఇలా కరివేపాకు చెట్టులోని అన్నిటికి ఔషధ గుణాలు ఉన్నాయి.
అందుకే కరివేపాకే కదా అని చిన్నచూపు అస్సలు చూడకూడదు.
కరివేపాకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.ప్రతిరోజు మన డైట్‌లో కరివేపాకు చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
ఎందుకంటే.కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల.
స్టార్చ్ ను గ్లూకోజ్ గా మార్చడాన్ని నిరోధిస్తుంది.దీంతో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.
అలాగే ప్రతిరోజూ కరివేపాకు తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరివేపాకు జీర్ణ సమస్యలను నివారించడంలోనూ గ్రేట్‌గా పనిచేస్తుంది.
ముఖ్యంగా అజీర్ణం, విరేచనాలు మరియు మలబద్ధకం వంటి అనేక జీర్ణ సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టవచ్చు.ఇక కరివేపాకులో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ ఎ కళ్లకు ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మరియు కరివేపాకు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది.
చూశారా.కరివేపాకే కదా అని తీసిపారేస్తే.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది.కాబట్టి, కరివేపాకును ప్రతి రోజే ఏదో ఒకరూపంలో తీసుకోవడం మంచిది.