విమానం ల్యాండింగ్ సమయంలో విండో షట్టర్స్ ఎందుకు ఓపెన్ చేసి ఉంచాలంటే..?

చాలా మందికి విమానంలో ప్రయాణించాలని ఉంటుంది.అయితే విమాణ ప్రయాణంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విండో షట్టర్స్ ఎందుకు తెరుస్తారో ఎవ్వరికీ తెలీదు.

 Why Should Open The Window Shutters While Landing The Aeroplane , Flight Landing-TeluguStop.com

అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.విమానం గాలిలోకి ఎగిరే సమయం, అదేవిధంగా కిందకి దిగే సమయం రెండూ చాలా ప్రమాదకరం.

ఈ విషయం అందరికీ తెలిసిందే.ఈ రెండు సందర్భాల్లోనూ ఏ పొరపాటు జరిగినా విమానం ప్రమాదంలో పడుతుంది.

విమానంలో టేకాఫ్ మరియు ల్యాండింగ్ రెండూ చాలా ప్రమాదకరమని మనందరికీ తెలుసు.విమానం టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పైగా ఆ విషయం మనకు తెలుసు కనుక రెండు సందర్భాలలోనూ మనకు తెలీకుండానే భయపడతాం.కిటికీలు తెరిచి ఉంచడం ద్వారా మన దృష్టి ఆ సమయంలో కచ్చితంగా బయట వైపు మరలుతుంది.

దీంతో మనసులో భయాలు చోటు చేసుకునే అవకాశం తగ్గి రిలాక్స్ గా ఉండగలుగుతాము.ఇక ఇలా చేయడం వల్ల మన కళ్ళు విమానం వెలుపల ఉండే కాంతికి అలవాటు పడతాయి.

ఇక విమానం కిటికీ తెరచి ఉంచడం ద్వారా విమాన సహాయకులు విమానం వెలుపల కనిపించే రెక్కలను సులభంగా చూడగలుగుతారు.ఒకవేళ రెక్కల ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటె వారికి సులభంగా అర్ధం అవుతుంది.

Telugu Fears, Latest, Window Shutters, Relax, Time, Aeroplane, Windows-Latest Ne

దానిని వెంటనే విమాన కెప్టెన్ కు చెప్పి అలెర్ట్ చేయగలుగుతారు.అదేవిధంగా అప్పుడు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో సులభంగా ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు అనే విషయం మనకు అర్ధం అవుతుంది.ఈ క్రమంలో విండోను తెరిచి ఉంచడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది.కిటికీలు మూసివేస్తే, విమానం లోపల ఏమి జరుగుతుంది? అనేది బయటి వ్యక్తులు చూడలేరు.క్యాబిన్ మంటల్లో ఉన్నా లేదా పొగ వస్తున్నా, కిటికీ మూసివేస్తే అది బయటివారికి కనిపించదు.కిటికీలు తెరిచి ఉంచినట్లయితే, విమానం లోపల వారికి ఏమి జరుగుతుందో స్పష్టంగా చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube