రియా సోదరుడికి బెయిల్ ఎందుకు రాలేదో తెలుసా?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ చెయ్యగా డ్రగ్స్ కేసు బయటపడిన సంగతి తెలిసిందే.ఈ డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజపుత్ ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యగా దాదాపు 28 రోజుల తర్వాత నిన్న బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

 Rhea Chakraborty, Sushant Singh Rajput, Drugs Case, Rhea Brother, Shovik Chakrav-TeluguStop.com

అయితే సుశాంత్ మరణ కేసులో విచారణ జరిగిన తర్వాత డ్రగ్స్ గురించి విషయాలు బయట పడగా కొన్ని విచారణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ రియా చక్రవర్తిని విచారించగా, ఆమె డ్రగ్స్ కోసం డబ్బులు ఖర్చు చేసిందని తేలగా సెప్టెంబర్ 8న ఆమెను అరెస్టు చేశారు.ఎన్ సీ బీ వివరణ ప్రకారం ఆమె 5 గ్రాముల డ్రగ్స్ తీసుకోవడానికి దానికోసం రూ.10 వేలు ఖర్చు చేయగా, ఆ డ్రగ్స్  ఆమె కోసం కాదని ఇతరులకు అందచేయడానికి అని తేలింది.

అంతే కాకుండా నేరుగా ఆ డబ్బును అందించినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయేసరికి ఆమె తరపున వాదించిన న్యాయవాది సతీష్ మాన్ షిండే నిషేధిత డ్రగ్స్ కోసం వాదించగా రియా ఖర్చు చేసిన డబ్బు ఫైనాన్స్ కిందకు రాదని న్యాయమూర్తి వివరించారు.

అంతేకాకుండా ఎన్ డిపీఎస్ చట్టం ప్రకారం నిషేధమైనా డ్రగ్స్ ను వాడటం శిక్షనే అని న్యాయమూర్తి వెల్లడించగా అది కేవలం ఇతరుల వినియోగం కోసం ఖర్చు చేసినందున ఫైనాన్స్ కిందకు రాదని తెలిపారు.దీంతో ఆమెకు బెయిల్ అందింది.

అయితే రియా చక్రవర్తికి బెయిల్ వచ్చినప్పటికీ ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ అందలేదు.ఎందుకంటే షొవిక్ చక్రవర్తి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారితో చేయి కలుపుకున్నాడని దీనితో వాళ్లతో ఉన్న సంబంధాల గురించి ఆధారాలు ఉండటంతో అతనికి బెయిల్ దక్కలేదు.

దీంతో అతడు డ్రగ్స్ డీలర్ల నుండి ఇతర లావాదేవీలు జరుపుతున్నాడని ఎన్ సీ బీ విచారణలో ఆధారాలతో సహా ఉన్నందున బాంబే హైకోర్టు షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube