పెళ్లిపై రష్మీ మౌనం.. ఏమిటో ఆంతర్యం?  

Why Rashmi Gautam Silent On Marriage Rumours, Rashmi Gautam, Sudheer, Jabardasth, Marriage, Tollywood News - Telugu Jabardasth, Marriage, Rashmi Gautam, Sudheer, Tollywood News

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతోనూ మెప్పిస్తూ, బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ కామెడీ షోతో పాటు పలు ఛానల్స్‌లో తనదైన యాంకరింగ్‌తో ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

TeluguStop.com - Why Rashmi Gautam Silent On Marriage Rumours

ఇక ఈ చిన్నది వెండితెరపై కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.కాగా కొంతకాలంగా రష్మీ గౌతమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌తో రష్మీ కెమిస్ట్రీ చూసి వారిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ గతకొంత కాలంగా బలంగా వినిపిస్తోంది.దీనికి ఆజ్యం పోసినట్లు పలు టీవీ షోల్లో కూడా వారిద్దరి పేరుతో ఆయా ఛానల్ నిర్వాహకులు కాసులు కలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల రష్మీ చాలా పరిమితంగా టీవీ షోల్లో కనిపిస్తూ వస్తోంది.దీంతో ఆమె ఇక పెళ్లికి రెడీ అవుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

TeluguStop.com - పెళ్లిపై రష్మీ మౌనం.. ఏమిటో ఆంతర్యం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీనికి తోడు సుడిగాలి సుధీర్‌తో ప్రేమను వారి వారి కుటుంబ సభ్యులు ఓకే చేశారని, అందుకే రష్మీ-సుధీర్‌లు ఇక పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో పక్కనబెడితే, రష్మీ కనీసం ఈ వార్తలపై స్పందించేందుకు కూడా ఆసక్తిగా లేదని తెలుస్తోంది.

ఎప్పుడు తన పెళ్లి గురించి అడిగినా మాట దాటేసే తరహాలో రష్మీ ప్రవర్తిస్తుండటంతో ఆమె ఈ కామెంట్స్‌పై ఎందుకు మాట్లాడటం లేదనే సందేహం కూడా పలువురిలో నెలకొంది.నిజంగానే రష్మీ సుధీర్‌ను పెళ్లాడబోతుందా అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెదులుతోంది.

మరి ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే మాత్రం రష్మీ తన పెళ్లి గురించి ఏదైనా క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.

#Sudheer #Jabardasth #Marriage #Rashmi Gautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Rashmi Gautam Silent On Marriage Rumours Related Telugu News,Photos/Pics,Images..