రంభ. ఈ పేరు కు సరిగ్గా సరిపోయే అందం అభినయం ఆమె సొంతం.
సీనియర్ హీరోయిన్ గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎందుకంటే నిన్నటి తరంలో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలందరి సరసన నటించింది.తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ రాణించింది.
కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సినిమాలకు దూరమై పోయింది.
ఇక అప్పుడప్పుడు పలు బుల్లితెర కార్యక్రమాల్లో మెరిసినప్పటికీ సినిమాల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరం పద్నాలుగేళ్లు గడిచిపోతుంది.
కానీ అభిమానులు మాత్రం రంభ నటించిన సినిమాలు చూస్తూ తెగ ఆనందపడి పోతున్నారు.ఇక ప్రస్తుతం రంభ వయసు 45 ఏళ్లు.
కానీ ఈ అమ్మడును చూస్తే మాత్రం ఎవరు నమ్మరు.ఎందుకంటే 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో ఒకప్పటి హీరోయిన్ లాగానే కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లి తర్వాత భర్తతో కలిసి కెనడా లో సెటిల్ అయ్యింది.

ఇండస్ట్రీకి దూరమైంది.ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులను మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది ఈ సీనియర్ హీరోయిన్.ఇక ఇటీవలే బహమాస్ లో వెకేషన్ కి వచ్చాను అంటూ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం రంభకి ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.ఫోటో చూసిన తర్వాత అభిమానులందరూ మరోసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి పోతున్నారు.

మనం కూడా కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.ఏపీ లో ఒక తెలుగు కుటుంబంలో పుట్టింది రంభ.ఇక చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తితో స్టేజ్ షో లలో నటిస్తూ వచ్చింది.అంతలో సినిమా అవకాశం తలుపుతట్టింది.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే వెండితెరపై మెరిసింది.ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైంది.
ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది.గ్లామర్ పాత్రలతో అందరి మతి పోగొట్టింది.2010లో శ్రీలంక బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ పద్మనాథన్ ను పెళ్లితో కెనడా లో సెటిలైంది.సినిమాలకు దూరం అయ్యింది.
ఇక ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం చూస్తే మరికొన్ని రోజుల్లో రంభ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది.