రాహుల్ నమ్మకాన్ని టి.కాంగ్రెస్ నాయకులు నిలబెడతారా .  

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతం కంటే కొంచెం చురుగ్గా కనిపిస్తున్నాడు. దేశంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. అందులో భాగంగానే ముందుగా ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీలో ఉత్సాహం నింపే పనిలో పడ్డారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన రాహుల్ పార్టీలో నూతన ఉత్సాహం నింపారు. మొదటి నుంచి కాంగ్రెస్ తెలంగాణ మీద భారీగానే ఆశలు పెట్టుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటుందనే స్థాయిలో రాహుల్ బాగా నమ్మకంతో ఉన్నట్టుగా, దాని కోసం ఏదో చెయ్యాలన్నట్టుగా రాహుల్ కనిపిస్తున్నాడు.

Why Rahul Gandhi Beliefs Telangana Congress Party Leaders-

Why Rahul Gandhi Beliefs Telangana Congress Party Leaders

కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలు అమలు చేశామనీ, ఆచరణ సాధ్యం కానివి తాను మాట్లాడను అంటూ ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనలో రాహుల్ చాలా చురుగ్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామనీ, కావాలంటే బెట్ అంటూ మీడియాకు సవాల్ విసిరేంత రేంజ్ లో రాహుల్ ధీమా వ్యక్తం చేసాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తేవడానికి తాను ఏమి చెయ్యాలనుకుంటున్నాడో రాహుల్ గాంధీ చెప్పేశారు. కానీ, వీటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర నేతలపై ఉంటుంది. మహిళలు, నిరుద్యోగులు, సీమాంధ్రులు. వీరందరినీ ఆకర్షించే ప్రయత్నం రాహుల్ చేశారు.

కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎంతవరకు రాహుల్ నమ్మకాన్ని నిలబెడతారో తెలియదు ఎందుకంటే … ఇప్పటికే ఇక్కడ నాయకుల్లో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది . ఎవరికి వారు తాము గొప్ప అంటే తాము గొప్ప అనే రేంజ్ లో పోటీ పడుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలకు అయితే కొదవే లేదు దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఆరితేరిపోయారు.

Why Rahul Gandhi Beliefs Telangana Congress Party Leaders-

ఈ నేపథ్యంలో రాహుల్ ఆశయాల్నీ, ఆశల్నీ ఎవరు భుజాన వేసుకుని వెళ్లాలనే అంశం మీద కాంగ్రెస్ నేతల్లో సమన్వయం కుదరడమే ఒక సమస్యగా కనిపిస్తోంది. తెలంగాణలో కొంత కష్టపడితే పార్టీకి మంచి అవకాశాలున్నాయనే నమ్మకం జాతీయ నాయకత్వానికి బాగా ఏర్పడింది కానీ అది నిజం చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీదే ఉంది.