ఐఏఎస్ కావాలనుకుని.. ఆ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎందుకు వచ్చింది?

సినిమా పరిశ్రమ పట్ల ఎంతో మందికి చాలా ఆసక్తి ఉంటుంది.వెండి తెరపై ఓ వెలుగు వెలగాలి అని చాలా మందికి ఉంటుంది.

 Why Raasi Khanna Turns Her Career Into Movies, Raasi Khanna , Tollywood , Study-TeluguStop.com

హీరోయిన్లుగా మారి బాగా రాణించాలి అని అనుకున్నారు.వందల మంది.

ఇంకా చెప్పాలంటే వేల మంది హీరోయిన్లుగా కావాలని ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే వాళ్లలో చాలా మందికి అవకాశాలు రావు.

కొంత మంది మాత్రమే హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటారు.మంచి అవకాశాలు వస్తే స్టార్ హీరోయిన్లుగా అవుతారు.

అలా అనుకోకుండా సినిమారంగంలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయిన అమ్మాయే రాశీ ఖన్నా.వాస్తవానికి తను బాగా చదవుకుని ఐఏఎస్ కావాలి అని కలలు కనింది.

కానీ అనుకోకుండా మోడలింగ్ లోకి వచ్చి ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.

నిజానికి రాశీఖన్నా మంచి తెలివైన విద్యార్థి.

బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది.ఐఏఎస్ కోసం ప్రయత్నించాలి అనుకుంది.

అయితే తొలుత మోడలింగ్, ఆ తర్వాత కాపీ రైటర్ గా పని చేసింది.ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు వచ్చాయి.

దీంతో హీరోయిన్ గా మారింది.వరుసగా తనకు పలు అవకాశాలు దక్కాయి.

ముందుగా బాలీవుడ్ సినిమా మద్రాస్ కేఫ్ అనే సినిమాలో నటించింది.మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Bollywood, Carrer, Jai Lavakusha, Madras Kafe, Raashi Khanna, Raasi Khann

ఆ త‌ర్వాత తెలుగు లోకి అడుగు పెట్టింది.అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే వేళ సినిమా ద్వారా తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.అప్ప‌టి నుంచి తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగింది.ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తుంది.

Telugu Bollywood, Carrer, Jai Lavakusha, Madras Kafe, Raashi Khanna, Raasi Khann

బాలీవుడ్ లో యోధ అనే సినిమా చేస్తుంది.అయితే ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 7 ఏండ్లు అవుతున్నా.స్టార్ హీరోల పక్కన పెద్దగా ఛాన్సులు రాలేదు.ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో మాత్రమే నటించింది.పలు సినిమాల్లో ఆమె ఇతర హీరోయిన్లతో కలిసి నటించింది.మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.

మొత్తంగా రాశీ ఖన్నా తెలుగు సినిమా పరిశ్రమలో బాగానే రాణించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube