ఆ సినిమా టైటిల్ లో’ ఇంగ్లీషులో ‘D’ ఎందుకు పెట్టారంటే..?

టాలీవుడ్ హీరోలో ఒకరైన శ్రీకాంత్ తనయుడు రోషన్ టాలీవుడ్ హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పేరు పొందిన దర్శకుడు రాఘవేంద్రరావు చాలా రోజుల తర్వాత పెళ్లిసందడి అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 ఆ సినిమా టైటిల్ లో’ ఇంగ్లీషు-TeluguStop.com

ఇదివరకు పెళ్లిసందడి సినిమాలో హీరో శ్రీకాంత్ నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమందరం చూసాం.

ఇప్పుడు అదే సినిమా పేరుతో తన తనయుడు రోషన్ కూడా నటిస్తుండడం గమనార్హం.తండ్రికి కలిసొచ్చిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు తనయుడికి కూడా కలిసి వస్తుందా.? అని ఇండస్ట్రీలో గుసగుసలాడుతున్నారు.

మరోసారి పెళ్లిసందడి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి అనేక ప్రశ్నలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఇందులో ఒక ప్రశ్న.ప్రస్తుతం తెరకెక్కుతున్న పెళ్లిసందడి టైటిల్ లో ఇంగ్లీష్ లెటర్ ‘D’ గురించి.

అయితే ఇలా ఎందుకు పెట్టారు అన్న విషయానికి వస్తే ఓ ప్రత్యేకమైన కారణం ఉందంటున్నారు చిత్ర బృందం సభ్యులు.టైటిల్ లో వెరైటీగా కనిపించేందుకు ‘D’ అక్షరం సరదాగా పెట్టింది కాదని వారు చెబుతున్నారు.

ఆ ఇంగ్లీష్ అక్షరానికి సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉందని వారు చెబుతున్నారు.

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందరూ ఆయన సినిమాలో నటించే హీరోయిన్స్ పైనే ఎక్కువ దృష్టి పెడతారు.ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ఇద్దరు హీరోయిన్లను నటిస్తారని సమాచారం.అయితే ఆ హీరోయిన్స్ ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

అతి తొందరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.చూడాలి మరి దర్శకేంద్రుడు రోషన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube