అల్లు అరవింద్‌కు సినిమాలపై విరక్తి.. ఎందుకంటే  

మెగా నిర్మాత అల్లు అరవింద్‌కు సినిమాలపై విరక్తి కలుగుతుందట. తాజాగా ఈయన నిర్మించిన ‘గీత గోవిందం’ చిత్రం లీక్‌ అవ్వడంతో ఈ విరక్తి కలిగినట్లుగా తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన గీత గోవిందంకు చెందిన పలు సీన్స్‌ లీక్‌ అయ్యాయి. ఇక ఒక హ్యాకర్‌ ఏకంగా సినిమా మొత్తంను గూగుల్‌ డ్రైవ్‌లో పోస్ట్‌ చేశాడు. దాంతో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లింది. సినిమా విడుదలకు ముందే ఇలా లీక్‌లు అవ్వడం గతంలో పలుసార్లు అయ్యాయి. కాని ఈసారి మాత్రం గీతగోవిందం విషయంలో మరో అడుగు ముందుకు పడ్డట్లు అయ్యింది.

Why Producer Allu Aravind Dont Interested In Filmmaking-

Why Producer Allu Aravind Dont Interested In Filmmaking

గీత గోవిందం చిత్రంపై అంచనాలు మొదటి నుండి ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమా విడుదల సమయంలో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను దర్శకుడు పరుశురామ్‌ తెరకెక్కించాడు. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకుంటున్న సమయంలో ఇలా లీక్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు షాక్‌ అయ్యారు. నిర్మాత అల్లు అరవింద్‌ అసలు ఇలాంటి విషయాలు చూస్తుంటే సినిమా పరిశ్రమను వదిలేయాలన్నంత కోపంగా ఉందని, ఇలా జరుగుతున్నప్పుడు సినిమా పరిశ్రమ ఏమవుతుందో అనే ఆందోళన ఉందని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.

Why Producer Allu Aravind Dont Interested In Filmmaking-

అల్లు అరవింద్‌ దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించాడు. కాని ఇలాంటి పరిస్థితి ఆయనకు ఎప్పుడు ఎదురు కాలేదు. సినిమాలు ఫ్లాప్‌లు, సూపర్‌ హిట్‌ అయినా ఎప్పుడు సినిమాలపై విరక్తి కలుగలేదు. కాని ఎంతో కష్టపడి సినిమాను నిర్మిస్తే అది కాస్త విడుదలకు ముందే లీక్‌ అయితే అప్పుడు ఎంతో బాధగా ఉందనిపిస్తుంది అంటూ అల్లు అరవింద్‌ అంటున్నారు. ఇలాగే ముందు ముందు జరిగితే సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తాను అంటూ అల్లు అరవింద్‌ సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా సమాచారం అందుతుంది.