గర్భవతిగా ఉన్నప్పుడు అవి వాడితే ప్రమాదం   Why Pregnant Women Should Never Use Cosmetics ?     2017-05-23   06:14:00  IST  Raghu V

గర్భం దాల్చితే చాలు, స్త్రీ ఎన్నో విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఆరోగ్యం కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. కాఫీ ఇష్టముంటే కాఫీ మానెయ్యాలి, మసాలా ఐటమ్స్ వదిలేయాలి, ఫాస్ట్ ఫుడ్ వదిలేయాలి, ఇష్టం ఉన్న లేకున్నా ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ త్యాగాల లిస్టు ఇక్కడితో ఆగిపోకూడదు. తల్లి మరో త్యాగం చేయాలి. ఏంటంటే .. కాస్మోటిక్ ప్రాడక్ట్స్ వాడటం మానెయ్యాలి. ఎందుకు ? కాస్మోటిక్ ప్రాడక్ట్స్ ఎందుకు వాడకూడదు ?

వినాళ గ్రంధులు లేదా Endocrine Glands తెలుసుగా ? ఈ గ్రందాల నుంచే మన శరీరంలోకి హార్మోన్స్ విడుదలయ్యేది. అవే రక్తం ద్వారా మన శరీమంతటా చేరతాయి. కొన్ని రకాల వినాళ గ్రంధులు ఉంటాయి మన శరీరంలో. థైరాయిడ్ గ్రంధి, పారాథైరాయిడ్ గ్రంధి, అధివృక్క గ్రంధి, పియూష గ్రంధి, అండకోశము, క్షోమము, పురుషుల్లు అయితే వృషనాల్లో కూడా ఉంటాయి ఇవి.

ఇక ప్రేగ్నేన్సి సమయంలో కాస్మోటిక్స్ విషయానికి వస్తే, కాస్మోటిక్ ప్రాడక్ట్స్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. అసలు కెమికల్స్ వాడనిదే ఈ స్కిన్ కేర్ ప్రాడక్టు ఈరోజుల్లో తయారవడం లేదు. ఆ ప్రాడక్ట్స్ నుంచి కాష్ Atrazain, Phthalates, Dioxn, BPA లాంటి కెమికల్స్ మన వినాళ గ్రంధుల్లోకి చొచ్చుకుపోయి హార్మోన్స్ ఇమ్బ్యాలేన్స్ కి కారణం అవుతాయి. అదే జరిగితే బిడ్డ లోపాలతో పుట్టడం జరిగే ప్రమాదం లేకపోలేదు.

ఈ రసాయనాలు ఒకటి రెండు కాదు, దాదాపు అన్ని కాస్మోటిక్ ప్రాడక్ట్స్ లో ఉంటున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే పెర్ఫ్యూంలో Phthaltes అనే హానికరమైన కెమికల్ ఉంటుంది. ఇలాగే నెయిల్ పెయింట్, హెయిర్ డై,, బ్యూటి క్రీమ్స్, మేకప్ ప్రాడక్ట్స్ .. అన్నిట్లోనూ ఈ కెమికల్స్ కలుపుతున్నారు. కాబట్టి గర్భంతో ఉన్న తల్లులు బిడ్డకు జన్మనిచ్చే దాకా అయినా కొద్దిగా అలంకారాలకు దూరంగా ఉంటే మంచిది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.