ఆకాష్‌ పూరి అంటే ప్రభాస్ కు ఎందుకు ఇంత ప్రేమ!

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సూపర్ స్టార్‌ ప్రభాస్‌.ఆ విషయంలో ఏ ఒక్కరికి డౌట్‌ అక్కర్లేదు అంటూ ప్రతి ఒక్కరి నమ్మకం.

 Why Prabhas Promoting Puri Akash Romantic Movie-TeluguStop.com

ఎందుకంటే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల ఖరీదు దాదాపుగా మూడు వేల కోట్లు.ఇంత భారీ బడ్జెట్‌ సినిమాలు అది కూడా బ్యాక్ టు బ్యాక్‌ చేయడం ఏ ఒక్కరి తరం కాదు.అందుకే ఖచ్చితంగా నెం.1 ఇండియా కా స్టార్‌ ప్రభాస్ అనడంలో సందేహం లేదు.అద్బుతమైన ప్రభాస్ స్టార్‌ డమ్ ఏ చిన్న హీరో సినిమాకు పడ్డా కూడా ఖచ్చితంగా ఆ సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోతుంది.ఇప్పుడు ఆకాష్‌ పూరి కొత్త సినిమా రొమాంటిక్ గురించిన విశేషాలు ఇంతగా వైరల్‌ అవుతున్నాయి అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ వల్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రభాస్ స్వయంగా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.పట్టుబట్టి మరీ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినట్లుగా పూరి చెప్పుకొచ్చాడు.ఫోన్‌ ల మీద ఫోన్ చేసి తాను ఈ సినిమా కోసం.మనోడి కోసం ఏదైనా చేస్తాను అన్నాడు.

 Why Prabhas Promoting Puri Akash Romantic Movie-ఆకాష్‌ పూరి అంటే ప్రభాస్ కు ఎందుకు ఇంత ప్రేమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ఇంతగా పూరి ఆకాష్‌ ను పైకి లేపేందుకు చూడటం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పూరి ఆకాష్‌ కోసం ప్రభాస్‌ స్వయంగా తానే కావాలని టైమ్‌ కేటాయించి ప్రమోషన్‌ ఈవెంట్స్ ను ఏర్పాటు చేయడం వంటివి ఖచ్చితంగా రొమాంటిక్ సినిమాకు కలిసి వచ్చే అంశాలు అంటున్నారు.

ప్రభాస్‌ మరో సారి పూరి ఆకాష్‌ కు టైమ్ ఇచ్చాడు.ఒక రోజు అంతా కూడా పూరి ఆకాష్ తో ఉండి ఇంటర్వ్యూలు మరియు ఇతర ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నాడట.

ప్రభాస్ ఈ సమయంలో చేస్తున్న సినిమా లను బట్టి చూస్తే ఆయన ఒక్కో రోజు ఖరీదు కచ్చితంగా పది నుండి పదిహేను లక్షల వరకు ఉంటుంది అంటున్నారు.అలాంటి ఒక్క రోజు మొత్తంను కేటాయించడం అంటే మామూలు విషయం కాదు.

పూరి దర్శకత్వం లో ప్రభాస్ చేసిన సినిమా లు ఆయన కెరీర్ కు ఎంతగా యూజ్ అయ్యాయి అనేది అందరికి తెల్సిన విసయమే.ఆ విషయాలను పట్టించుకోకుండా తనకు ది బెస్ట్‌ స్నేహితుడిగా పూరి ఉంటాడు అనే ఉద్దేశ్యంతో ఆకాష్‌ కు తన వంతు సాయంను ప్రభాస్ చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Romantic #Prabhas #Puri Akash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube