సాధారణంగా కొత్త వాహనాలను కొన్నప్పుడు చాలామంది మొదటగా వాటికి పూజ చేయించే సాంప్రదాయాన్ని మన హిందువులు పాటిస్తారు.అలా పూజ చేయించడం వల్ల వాహనం ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఉంటుందని విశ్వసిస్తారు అయితే కొత్త వాహనాలకు ముఖ్యంగా మిరపకాయలు, నిమ్మకాయలను కడతారు.
అసలు నిమ్మకాయలు, మిరపకాయలనే ఎందుకు కడతారు? అలా కట్టడం వెనుక దాగి ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
నవగ్రహాలలో అత్యంత ఎరుపు రంగును కలిగి,ఉగ్ర తత్వం పోలిన గ్రహాన్ని కుజ గ్రహం అంటారు.
కుజుడు ప్రమాదాలకు కారకుడు కాబట్టి కుజుడికి ఆదిదైవం అయిన హనుమంతుని పూజించాలి.కుజుడుకు అత్యంత ప్రీతికరమైన వారం మంగళవారం కాబట్టి, మంగళవారం కొత్త వాహనాలను కొనడానికి చాలామంది ఇష్టపడరు.
అంతేకాకుండా దూర ప్రయాణాలను కూడా మంగళవారం రోజున వాయిదా వేసుకుంటారు.

పుల్లటి రుచి గ్రహాలలో శుక్రగ్రహానికి చెందినది.అభివృద్ధికి, సంపదకు మూల కారకుడు శుక్రుడు.కారం రుచి రవి గ్రహానికి చెందినది.
అంతేకాకుండా అధికారానికి,శాంతి కి మూల కారకుడు రవి.అయితే వాహనాలను నడిపే వారు ఎల్లప్పుడు శాంతియుతంగా ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు మిరపకాయలను మాలాగా కట్టి వేస్తారు.
అంతేకాకుండా శ్రీమహాలక్ష్మికి తీపి కరమైన వంటకాలు అంటే ఎంత ఇష్టమో, ఆమె అక్క అయిన అలక్ష్మి ఎంతో భిన్నంగా పులుపు, కారం అంటే ఇష్టం.అందువల్ల వాహనాలకు మిరపకాయలను, నిమ్మకాయలను కట్టడంవల్ల అలక్ష్మి ఎంతో సంతోషించి వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది.
అంతే కాకుండా ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా వాహనాలకు నిమ్మకాయ,మిరపకాయలను మాలగా వేసి పండితులచే పూజలు చేస్తారు.కేవలం కొత్త వాహనాలకు మాత్రమే కాకుండా, ఏవైనా పండుగ సందర్భాలలో వాహనాలను శుభ్రంగా కడిగి ఇలా నిమ్మకాయలను కడతారు.
ఇలా కట్టడం ద్వారా వాహనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగవని ప్రగాఢ విశ్వాసం.
LATEST NEWS - TELUGU