60 సంవత్సరాలకి షష్టి పూర్తి చేయడానికి కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచారవ్యవహారాలను ఎంతో పద్ధతిగా పాటిస్తారు.ఈ ఈ క్రమంలోనే కొన్ని శుభ కార్యాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

 Why People Do Shashtipurthi At 60 Years Did You Know Reason-TeluguStop.com

సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో వివాహ వేడుక ఒకసారి జరుగుతుంది.అయితే అది ఇక వయసులో ఉన్నప్పుడు జరిగే వేడుకను వివాహ వేడుక అంటారు.

అదే వేడుక అరవై సంవత్సరాలలో జరిగితే దానిని షష్టిపూర్తి అని చెబుతారు.మరి షష్టిపూర్తిని 60 కి మాత్రమే చేయడానికి కారణాలు ఏమిటి.

 Why People Do Shashtipurthi At 60 Years Did You Know Reason-60 సంవత్సరాలకి షష్టి పూర్తి చేయడానికి కారణం ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనే విషయాలు చాలా మందికి తెలియదు.మరి షష్టిపూర్తి 60 సంవత్సరాలలోనే ఎందుకు చేసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 .అదే కలియుగానికి వచ్చేసరికి మానవుడి ఆయుష్షు 120 లకి పడిపోయింది.అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి నిర్వహిస్తారు.60 సంవత్సరాలకు షష్టిపూర్తి ఎందుకు నిర్వహిస్తారు అనే విషయానికి వస్తే నారదుడు పుత్రులు 60 మంది యుద్ధంలోమరణించడం వల్ల శోకసంద్రంలో ఉన్న నారదుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు.నీ 60 మంది పుత్రులు ఈ కాల చక్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటారని వరం ఇవ్వడం చేత మనకు తెలుగు సంవత్సరాలు 60 గా ఉన్నాయి.ఈ క్రమంలోనే మనిషి 60 సంవత్సరాలకు చేరుకోగానే అతనికి ఈ లోక సంబంధ విషయాలు పూర్తయినట్లే.

మిగతా 60 సంవత్సరాలు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో బ్రతకాలని ధర్మ శాస్త్రం చెబుతోంది.

Telugu Hindhu Believes, Hindhu Rituals, Shashti Poorthi, Telugu Bhakthi-Telugu Bhakthi

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది.ప్రభవ నామ సంవత్సరంతో తెలుగు సంవత్సరాలు మొదలయ్యి అక్షయతో ముగుస్తాయి.అదేవిధంగా మరలా ప్రభవ నామ సంవత్సరం మొదలవుతుంది.

కనుక మనిషి పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాలు వచ్చే సమయానికి అదే సంవత్సరం మొదలవుతుంది.ఈ క్రమంలోనే ఈ 60 సంవత్సరాలు మానవుని ఆలోచనా శక్తి అమోఘంగా ఉంటుంది.60 సంవత్సరాల తర్వాత తిరిగి వారి మొదటి దశకు అనగా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఆలోచన పరిజ్ఞానం కాస్త తగ్గుతూ వస్తుంది.అందుకే 60 సంవత్సరాలు దాటిన ప్రతి తండ్రిని తన కొడుకు కన్నబిడ్డల్లా చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది.

ఈ క్రమంలోనే 60 సంవత్సరాల వయసులో తన బిడ్డలు, బంధువుల సమక్షంలో షష్టిపూర్తి కార్యక్రమాన్ని జరుపుకుంటారు.

#Hindhu Rituals #Shashti Poorthi #Hindhu Believes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU