పవన్ టార్గెట్ ఆ జిల్లానే..ఎందుకు ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులని టార్గెట్ చేస్తూ వాడి వేడి మాటలతో హీట్ పుట్టిస్తున్నారు మొన్న గుంటూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కాని అధికార పార్టీ పై ఎక్కుపెట్టిన విమర్శలలో గాని సింహభాగం పశ్చిమ జిల్లా నేతలే టార్గెట్ గా జరిగింది.అసలు ఎందుకు ఈ జిల్లా నేతలనే టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే దానికి రీజన్ లేకపోలేదు అయితే రీజన్ తెలుసుకునే ముందుగా అసలు జిల్లా టిడిపి నేతలపై పవన్ ఎక్కుపెట్టిన విమర్శలు ఏమిటి అంటే.

 Why Pawan Kalyan Target West Godavari Tdp Mlas..?-TeluguStop.com

పశ్చిమ జిల్లా నేతలు పూటకో లూటీ చేస్తున్నారనేది పవన్ బహిరంగంగా చెప్తున్న మాట.ఇసుక మాఫియా, ఆక్వాఫ్యాక్టరీ గొడవ, ఎమ్మార్వోపై దాడి.సమాజ సేవ చేసే డాక్టర్ భూమి కబ్జా, పోరాటాలు చేసే నాయకుల అరెస్టులు.ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు లేవనెత్తారు…ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేస్తే ఎందుకు స్పందించలేపోయారని చంద్రబాబు ని సూటిగా ప్రశ్నించిన పవన్ ఆ సభలో చితమనేని మెడ పై కత్తి పెట్టినంత పని చేశారు.

చింతమనేని కి కొమ్ములు వచ్చాయా మీరు ఏమి చేయలేరా అని చంద్రబాబు ని చింతమనేనిని టార్గెట్ గా చేస్తున్న పవన్.చితమనేనిపై ఉన్న కోపానికి లెక్క సరి చేశారు అని తెలుస్తూనే ఉంది…మరోపక్క భీమవరం సమీపంలో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ వద్దంటూ తుందుర్రు పరిసరాల్లోని గ్రామాల ప్రజలు నాలుగేళ్లుగా ఆందోళనలు చేపడుతున్నా సరే వారిని అరెస్టులు చేయించారు.

ఇది మీకు న్యాయమా అని ప్రశ్నించాడు పవన్.

అయితే ఒక్కసారి గా పవన్ టార్గెట్ ఎందుకంటే.

తన అన్న చిరంజీవి పశ్చిమ నుంచీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఆ అపవాదుని భర్తీ చేసుకునేందుకు మరియు ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకునే సరైన సమయం ఇదే కావడంతో జగన్ ఈ అవకాశాన్ని అంది పుచ్చుకునే లోగానే పవన ముందుకు కదిలాడు.

మరోపక్క పవన్ కుటుంబానిది పశ్చిమగోదావరి జిల్లానే కావటంతో పవన్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు మన మనిషి అనేలా అనిపించుకోవడానికి కూడా పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.జిల్లా సమస్యలు ఎకరువు పెడుతూ జిల్లా ప్రజల అభిమానం పొందటానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక భాగం అని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube