తల్లి తన బిడ్డని పూజించవచ్చా ? పార్వతిదేవి గణపతిని ఎందుకు పూజించింది ?  

Why Parvathi Devi Had To Worship Ganesha ?-

English Summary:The gods are not gods, we are listening to her parents' vastunnam lightning. Ganesha is a meme in the world to receive tolipujalu kartikeyudito rammante parents wrapped around the back and wins the competition.See for yourself the kathento.

One of the mantra, the mantra that he is a unique discovery of Panchakshara upadesincamani Parvati asked Lord Shiva.Sankara taught the mantra japincamani mantra for a while, ever tell anyone else talk. But despite promises of Lord Shiva and Parvati tells in detail of his celikattelaku throughout their conversation.The man became angry mahasivudu Panchakshari mantra chanting without any obstacles except for the brief period of time, said his next kurcovaddani. Lord Shiva and Parvati left kailasam to earth again reached compassion.

Parvati is a manisirupanlo Panchakshari mantra japincina think that is? Srikalahasti now. Without being hindered by any impediment to his tapassuki, man has worshiped in the form of Goddess Parvati vighnalanu ganapayyaki eliminate.Shiva said phalincadanto she repented back cleanly. Mount Kailash, where the West is heated at the time of leaving the back velugondi Ganapati, Ganesha devotees vighnalu was removed.Ganesha appears srikalahastilo still further. Some historians say that it is the only temple ganapatini Parvati worshiped...

తల్లి దండ్రులని మించిన దేవుళ్ళు దేవతలు లేరని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. తోలిపూజలు అందుకునే వినాయకుడు కూడా కార్తికేయుడితో జరిగిన ఓ పోటిలో ప్రపంచాన్ని చుట్టి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టే తిరిగి పోటిలో నెగ్గుతాడు. అక్కడే అర్థం చేసుకోండి తల్లిదండ్రుల గొప్పతనం ఏమిటో..

తల్లి తన బిడ్డని పూజించవచ్చా ? పార్వతిదేవి గణపతిని ఎందుకు పూజించింది ?-

మరి తల్లిదండ్రులని పూజించడం అనే పద్ధతికి అంత ప్రాముఖ్యత ఉంది కదా, ఒక తల్లి తన బిడ్డని పూజించడం ఎంతవరకు సరైన విషయం అంటారు ? అందులో ఏమైనా తప్పు ఉందా ? ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానం మాదగ్గర అయితే లేదు కాని, సాక్షాత్తు పార్వతి దేవి గణపతిని పూజించినట్టు పూరాణాలు చెబుతున్నాయి. ఆ కథేంటో మీరే చూడండి.పంచాక్షరీ మంత్రం యొక్క విశిష్టను గుర్తించిన పార్వతీదేవి ఒకనాడు ఆ మంత్రాన్ని తనకి ఉపదేశించమని పరమ శివుడిని అడుగుతుంది.

మంత్రాన్ని ఉపదేశించిన శంకరుడు కొంతకాలం ఆ మంత్రాన్ని జపించమని, అంతవరకు ఎవరితోనూ మాట్లాడకూడదని చెబుతాడు. కాని పార్వతిదేవి శివుడి మాటను లెక్కచేయకుండా తన చెలికత్తెలకు తమ సంభాషణ అంతా వివరంగా చెబుతుంది. దాంతో ఆగ్రహించిన మహాశివుడు మనుష్య రూపం దాల్చి పంచాక్షరి మంత్రాన్ని కొంతకాలం పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా జపిస్తే తప్ప, తన పక్కన కూర్చోవద్దని చెప్పాడు.

శివుడి కరుణ మళ్ళీ పొందేందుకు కైలాసం వదిలిన పార్వతీదేవి భూలోకాన్ని చేరుకుంది.పార్వతి దేవి ఒక మనిషిరూపంలో పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఆ ప్రదేశం ఏమిటి అనుకుంటున్నారు ? ఇప్పుడున్న శ్రీకాళహస్తి. తన తపస్సుకి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉండకుండా, మనిషి రూపంలో ఉన్న పార్వతి దేవి విఘ్నాలను తొలగించే గణపయ్యకి పూజలు చేసింది.

ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమె తపస్సు ఫలించడంతో శివుడు తిరిగి కరుణించాడు. కైలాసానికి తిరిగి బయలుదేరే సమయంలో ఇక్కడే పశ్చిమ దిక్కులో పుష్టి గణపతిగా వెలుగొంది, భక్తుల విఘ్నాలు తొలగించమని గణేషుడికి చెప్పింది. శ్రీకాళహస్తిలో ఇప్పటికి పుష్టి వినాయకుడు దర్శనమిస్తాడు.

పార్వతిదేవి గణపతిని పూజించిన ఆలయం అదొక్కటే అని కొందరు చరిత్రకారులు చెబుతారు.