భగవంతునికి అరటి, కొబ్బరికాయలను మాత్రమే సమర్పిస్తారు... ఎందుకని?  

భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నా మొదటి ప్రాముఖ్యత అరటి పండు,కొబ్బరి కాయకు ఇస్తారు. అందువల్ల వాటిని పూర్ణ ఫలాలు అని పిలుస్తారు. మన సృష్టిలో ఉన్న ఫలాలను తిని వాటిలో గింజలను నోటి నుండి ఊసేస్తాం. దానితో ఆ గింజలు ఎంగిలి పడతాయి. అలాగే కొన్ని పండ్లను పక్షులు తిని విసర్జిస్తాయి.

అవి భూమి మీద పడి మొలకెత్తి పండ్లు,పువ్వులు కాస్తాయి. వాటినే మనం భగవంతునికి నైవేద్యం పెడతాం. అది అంత శ్రేష్టం కాదు. అదే అరటి చెట్టు అయితే విత్తనాల నుండి కాకుండా పిలకలు నుండి మొక్క రావటం వలన ఎంగిలి అనే సమస్య ఉండదు. అలాగే కొబ్బరి చెట్టు విషయంలో కూడా కొబ్బరి కాయ నాటటం వలన మొక్క వస్తుంది. ఇక్కడ కూడా ఎంగిలి అయ్యే అవకాశం లేదు. అందువలన అరటి పండు, కొబ్బరికాయలు పూర్ణఫలాలయ్యాయి. విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన చేయటం తప్పనిసరి.