బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లును ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నాడో తెలుసా?

బొమ్మరిల్లు.సిద్ధార్థ, జెనీలియా జంటగా నటించిన సినిమా.2006లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ రేంజిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఫ్యామిలీతో పాటు యంగ్ జనరేషన్ ను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

 Why Ntr Rejected Bommarillu Movie, Jr Ntr, Jr Ntr Rejected Movie, Ntr Rejected B-TeluguStop.com

హాసిని నటన, సిద్ధార్థ పడిన తపన సినిమాకే హైలెట్ గా నిలిచాయి.పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

బొమ్మరిల్లు సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించాడు.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన భాస్క‌ర్ బొమ్‌ారిల్లు భాస్క‌ర్‌గా మారిపోయాడంటే ఈ సినిమా ఏ రేంజిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చిందట.నిజానికి బొమ్మరిల్లు సినిమా ముందు ఎన్టీఆర్ చేయాల్సింద‌ట‌.బొమ్మ‌రిల్లు క‌థ‌ను ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించాల‌ని ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌కు దిల్ రాజు సూచించాడ‌ట‌.క‌థ విన్న ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా క‌థ బాగా న‌చ్చింద‌ట.

అయితే పలు కారణాల మూలంగా ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు వెల్లడించాడు.స్క్రిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని కూడా చెప్పాడు.

Telugu Class, Raja Mouli, Jr Ntr, Ntr Mass, Ntr Bommarillu, Dil Raju, Rrr-Telugu

అయితే తనక అప్ప‌ట్లో ఉన్న ఇమేజ్ కార‌ణంగా ఆ సినిమా చేయలేదని ఎన్టీఆర్ వెల్లడించాడు.ఈ సినిమా వచ్చిన సమయంలో ఆయన వరుసబెట్టి మాస్ సినిమాలు చేస్తున్నాడు.ఈ క్లాస్ సినిమాను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే కారణంగా తను ఈ సినిమా చేయలేదని చెప్పాడు.

Telugu Class, Raja Mouli, Jr Ntr, Ntr Mass, Ntr Bommarillu, Dil Raju, Rrr-Telugu

ఎన్టీఆర్ సినిమా అంటేనే.డ్యాన్సులు, ఫైట్లు ఉంటాయని జనాలు ఆశిస్తారు.ఇందులో అవేమీ ఉండక పోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్నాడు.

ఆ ఆర్వాత సిద్ధార్థ ఈ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టాడు.ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ మిస్సయ్యాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube