తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన ఎన్టీఆర్ మాత్రం ఒక్కరే ఉంటారు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అలాంటి ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి ఏం కావాలో తెలుసుకొని అలాంటి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు అందులో భాగంగానే ఎన్నో సినిమాలు చేసి సిల్వర్ జూబ్లీ లు ఆడేలా చేశాడు.బొబ్బిలి పులి, అడవి రాముడు, లవకుశ, యమగోల, డ్రైవర్ రాముడు, మాయాబజార్ లాంటి సినిమాల్లో తనదైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు.
అలాంటి ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణ సినిమా లో హరికృష్ణ ఒక క్యారెక్టర్ చేశాడు అలాగే అన్నదమ్ముల అనుబంధం సినిమా లో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించాడు.
అయితే హరికృష్ణ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య,శివరామరాజు, శ్రీ రాములయ్య, స్వామి వంటి చిత్రాల్లో తనదైన నటనను చూపించి మంచి గుర్తింపు సాధించినప్పటికీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు కానీ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ మాత్రం అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సాధించాడు.బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల పైన ఎన్టీఆర్ గారి గురించి తెలిసిన వాళ్లు విమర్శలను చేస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ ఆ సినిమాలో ఎన్టీఆర్ గొప్పతనం మాత్రమే చూపించాడు బయోపిక్ అంటే మంచి తో పాటు ఆయన చేసిన చెడు కూడా చూపించాలి కానీ బాలకృష్ణ అలా చూపించలేదు ఎంత సేపు మంచి గా చూపించాడు అని విమర్శలు చేశారు ముఖ్యంగా ఆ సినిమాలో విలన్ గా చూపించిన నాదెండ్ల భాస్కర్ రావు గారు మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఎన్టీఆర్ అంత గొప్ప వాడు ఇంత గొప్ప వాడు అని మనం అనుకుంటాం కానీ ఆయన తన సొంత కొడుకు పెళ్లికే రాలేకపోయాడు అని చెప్పాడు.
అందులో భాగంగానే ఒకరోజు నాదెండ్ల గారు ఎన్టీఆర్ గారు సన్నిహితులు కావడం వల్ల నాదెండ్ల తో ఎన్టీఆర్ బాలకృష్ణ చెన్నైలో ఎవరినో లవ్ చేస్తున్నాడు అంట ఎవరితోనో తిరుగుతున్నాడు అని నాకు తెలిసింది అని చెప్పి ఎలాగైనా బాలకృష్ణకు మనం పెళ్లి చేయాలి అని అనడంతో కాకినాడకి చెందిన నాదెళ్ల బంధువుల అమ్మాయి అయిన వసుంధర గారిని నాదెండ్ల గారే చూశారని చెప్పారు.మొదట ఈ సంబంధానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదని ఆ తర్వాత వసుంధర వాళ్ళ ఫ్యామిలీ ఎన్టీఆర్ కి 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పాడు అయితే బాలకృష్ణ పెళ్లి రోజు నాదెండ్ల, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ లో ఉన్నారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రజల్లో తన పైన బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని అనుకొని నాదెండ్ల తో చెప్పాడంట మనం ఇప్పుడు పెళ్లికిపోవడం లేదు ఇక్కడే ఉంటున్నామని దాంతో బాలకృష్ణ పెళ్లికి హాజరు కాలేకపోయారు.
నాదెండ్ల మాట్లాడుతూ బాలకృష్ణకి నేనే సంబంధం చూసి పెళ్లి చేసాను అని చెప్పాడు.అప్పట్లో బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ రాకపోవడం అనేది సంచలనాన్ని రేపింది.అయితే నాదెండ్ల భాస్కరరావు గారు మాత్రం ఎన్టీఆర్ కావాలనే రాలేదని అలా తన కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని జనాలు అనుకోవాలని అలా చేశాడు అని చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే కథానాయకుడు, మహానాయకుడు సినిమాలపై తీవ్రమైన విమర్శలను చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ తను ఏది చేసినా జనాలని ఆకర్షించేలా చేయాలని ముందే అనుకుని అన్ని పనులు చేసేవాడు అని నాదెండ్ల చెప్పుకొచ్చాడు.