మహిళలు తమ పాదాలకు పట్టీలు ధరించడం అనేది మన హిందూ సాంప్రదాయాలలో ఒక ఆచారంగా వస్తోంది.ఈ క్రమంలోనే ఒక మహిళకు పెళ్లి అయిన తర్వాత కాళ్ళకు పట్టీలు, కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతుంటారు.
అదేవిధంగా పాప పుట్టినప్పటినుంచి తన కాళ్లకు పట్టీలు తొడిగి ఇంటిలో మువ్వల సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది.సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెండి పట్టీలని తొడుగుతారు.
ఈ వెండి మువ్వలు ధరించి ఆడపిల్ల ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటిలో నడుస్తున్నట్టు భావిస్తారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఫ్యాషన్ ఒక భాగమైపోయింది.
ఈ క్రమంలోనే పాదాలకు వెండి పట్టీలకు బదులు వివిధ రకాల డిజైన్లతో తయారైన పూసలు వంటి పట్టీలను కూడా ధరిస్తున్నారు.మరికొందరు సంపన్నులు ఏకంగా బంగారు పట్టీలు కూడా పాదాలకు తొడుగుతున్నారు.అయితే ఎన్ని రకాలు పట్టీలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం వెండి పట్టీలు మాత్రమే మహిళలు
ధరించాలని పండితులు చెబుతున్నారు.ఈ మధ్యకాలంలో మహిళలు చాలా మంది బంగారు పట్టీలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.నిజానికి బంగారు పట్టీలు ఎట్టి పరిస్థితులలో కూడా పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.
మన హిందూ పురాణాల ప్రకారం బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు.లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు వర్ణంలోనే బంగారం కూడా ఉంటుంది.మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన బంగారంతో పట్టీలు చేయించుకొని పాదాలకు తొలగడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక సైన్స్ పరంగా కూడా పాదాలకు వెండి పట్టీల తొడగటం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగించడానికి వెండి దోహదపడుతుంది.వెండి మన శరీరాన్ని చల్లబరుస్తాయి.
బంగారం వేడిని కలుగజేస్తుంది.ఈ క్రమంలోనే మన శరీరంలో బలం అనేది కింద నుంచి పైకి పాకుతుంది కనుక మన పాదాలు చల్లగా ఉంటే శరీరం మొత్తం చల్లబడుతుంది.
అందుకోసమే పాదాలకు కేవలం వెండి పట్టీలు మాత్రమే ధరించడం ఎంతో మంచిదని అటు ఆరోగ్య పరంగాను ఇటు ఆధ్యాత్మికపరంగాను వెండి మేలును కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు.