కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?  

నష్టాలు, బాధల నుండి బయట పాడేసే శక్తి సత్యనారాయణ వ్రతంనకు ఉంది. అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారంగా ఉంది.

సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసం. కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు.

ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారి అందరిని పిలుస్తారు. ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది. కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు. దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోనూ కలిసిపోతుంది. ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటంను అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.