శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?  

  • బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు ఈ తొమ్మింటిని నవగ్రహాలు అని అంటారు. జ్యోతిష్యులు ఈ నవగ్రహాల ఆధారంగానే జాతకాలు చెప్పుతూ ఉంటారు. గృహ స్థితిని బట్టి కొంతమందికి పరిహారాలు చెప్పుతూ ఉంటారు. ఆయా పరిహారాలు ఆయా గ్రహాన్ని బట్టి ఉంటాయి. అయితే నవగ్రహాలు మనకు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తాయి. దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • -

  • న‌వ‌ గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌త ఉంటుంది. శివుడు ఆ దేవతలను నియమించారు. అలాగే గ్రహాలకు మూలం అయినా సూర్య దేవునికి కూడా అధిదేవత శివుడే. అందువల్ల గ్రహాలు అన్ని శివుని ఆదేశాల మేరకు సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువగా నవగ్రహాలు శివాలయాల్లో కనపడుతూ ఉంటాయి.

  • మన పురాణాల ప్రకారం పరం శివుని ఉంటే నవగ్రహాలు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. అందుకే చాలా మంది భక్తులు శివాలయంలోకి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గరకు వెళ్లకపోయినా, శివునికి అభిషేకం చేయిస్తారు. ఆ దేవదేవుని అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం. అలాగే నవగ్రహాల ప్రభావం కూడా ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. అయితే ఈ మధ్య కాలంలో ఇతర ఆలయాలలో కూడా నవగ్రహ మండపాలను నిర్మిస్తున్నారు.