మరి బంగార్రాజు పరిస్థితి ఏంటీ నాగార్జున గారు?

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది.ఆ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది.

 Why Nagarjuna Not Responding About Bangarraju Movie , Nagarjuna, Bangarraju Movi-TeluguStop.com

రెండవ షెడ్యూల్‌ ను కూడా వెంటనే మొదలు పెట్టాలనుకుంటే కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నిలిచి పోయింది.గత వారం రోజులుగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా క్యాన్సిల్‌ అయ్యిందటూ వార్తలు వస్తున్నాయి.

కథ విషయంలో నాగార్జున కాస్త వెనుక ముందు ఆడుతున్నాడని.వైల్డ్‌ డాగ్‌ సినిమా తరహాలోనే ఇది కూడా ఉంటే పెద్దగా జనాలు ఆధరించక పోవచ్చు అంటూ నాగ్‌ భావించాడు.

అందుకే సినిమా ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.కాని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ఆ సినిమా ను క్యాన్సిల్‌ చేసుకోలేదు.

స్వయంగా నాగార్జున స్పందిస్తూ మీడియాలో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్రవీణ్‌ సత్తారు మూవీ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎందుకు బంగార్రాజు సినిమా విషయంలో మాత్రం అస్సలు స్పష్టత ఇవ్వడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నాగార్జున గత నాలుగు సంవత్సరాలుగా బంగార్రాజు సినిమా విషయంలో ఊరిస్తూ వస్తున్నాడు.కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిన దాఖలాలు లేవు.చాలా సార్లు అసలు బంగార్రాజు లేదు ఏమీ లేదు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.ఆ తర్వాత కొన్ని సార్లు అదుగో ఇదుగో కథ సిద్దం అంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవల కూడా స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.కాని మళ్లీ బంగార్రాజు గురించి అభిమానులకు నచ్చని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

మొత్తానికి నాగార్జున పుకార్లకు చెక్ పెట్టి

ప్రవీణ్ సత్తారు

సినిమా ను కన్ఫర్మ్‌ చేశాడు.మరి ఎందుకు బంగార్రాజు సినిమాను మాత్రం ప్రకటించడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube