ఆన్ స్క్రీన్ లో అదుర్స్ అనిపించుకుంటున్న చైతన్య.. సమంత విషయంలో మాత్రం?

లవ్ స్టోరీ సినిమాతో చైతూ ఖాతాలో మరో సక్సెస్ చేరింది.ఆన్ స్క్రీన్ లో చైతన్య అదరగొట్టేశారు.

 Why Nagachaitanya Not Balancing Real Life Wth His Wife Samantha-TeluguStop.com

మహేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు చైతన్య నటనను మెచ్చుకుంటున్నారు.సాయిపల్లవితో కలిసి నటించి మెప్పించడం తేలిక కాకపోయినా నాగచైతన్య మాత్రం నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు.

చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం నాగచైతన్య స్క్రీన్ పై అద్భుతంగా పలికించడం గమనార్హం.

 Why Nagachaitanya Not Balancing Real Life Wth His Wife Samantha-ఆన్ స్క్రీన్ లో అదుర్స్ అనిపించుకుంటున్న చైతన్య.. సమంత విషయంలో మాత్రం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లవ్ స్టోరీ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోగా మౌని, రేవంత్ పాత్రలలో నాగచైతన్య, సాయిపల్లవి జీవించారనే చెప్పాలి.

నాగచైతన్య ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.జోష్ సినిమా నుంచి నాగచైతన్య సినిమాసినిమాకు పరిణతి చెందుతున్నారు.క్లాస్ సినిమాలలో నాగచైతన్య నటనకు ఏ మాత్రం వంక పెట్టలేం.అయితే ఆన్ స్క్రీన్ లో బెస్ట్ అనిపించుకుంటున్న చైతన్య ఆఫ్ స్క్రీన్ లో మాత్రం వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ఏ మాయ చేశావె, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో చైతన్య, సమంత కలిసి నటించి విజయాలు అందుకున్నారు.అయితే చైతన్య, సమంత విడిపోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తలను అటు చైతన్య, ఇటు సమంత పూర్తిస్థాయిలో ఖండించకపోవడం గమనార్హం.

ఈ మధ్య కాలంలో చైతన్య సమంత దంపతులపై జరిగినంత ప్రచారం మరెవరి గురించి జరగలేదు.

సమంత, చైతన్య కలిసి మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలకు చెక్ పెడితే బాగుంటుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.చైతన్య చొరవ తీసుకుని అక్కినేని కుటుంబం పరువుకు భంగం వాటిల్లేలా జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాగచైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ, బంగార్రాజు సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలు చైతన్య కెరీర్ కు ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

#Samantha #Love Story #Saipallavai #Chaitanya #Akkineni Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు